అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వైన్ ఫ్లూతో మరణించిన వైనం సంచలనంగా మారింది. రాజస్థాన్ రాష్ట్ర అధికారపక్షమైన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కీర్తి కుమారి సోమవారం స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లా మందల్ ఘర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్వైన్ ఫ్లూతో బాధ పడుతున్న ఆమెను.. ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం జైపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన ఆమె శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను అత్యవసర వైద్య సేవల కింద వెంటిలేటర్ పై ఉంచి వైద్యం చేశారు.
అయితే.. ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2013లో జరిగిన రాజస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో కీర్తి కుమారి 83 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వైన్ ఫ్లూ కారణంగా మరణించటంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.