ఆప్ అధినేత - ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అక్రమంగా కేసులో ఇరికించాలని సీబీఐ వేధించడం వల్లనే తాను స్వచ్ఛంద పదవీ విరమణను కోరారని ఆయన మాజీ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ వెల్లడించారు. తనను నిందితుడిగా చూపిన ఉదంతంలో సీఎంను కూడా చేర్చాలని సీబీఐ కోరిందని చెప్పారు. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్కూలులో చదివే - 27 ఏళ్లపాటు ప్రభుత్వంలో సేవలందించే అవకాశం ఇచ్చిందని రాజేంద్రకుమార్ మీడియాకు చెప్పారు. వీఆర్ ఎస్ నిర్ణయం చాలా కష్టతరమైనదే అయినప్పటికీ తాను చాలా బరువెక్కిన హృదయంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి చాలా మార్గాలున్నాయని రాజేంద్ర కుమార్ అని పేర్కొన్నారు.
రాజేంద్రకుమార్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ''సీబీఐ నా ఇంటిమీద దాడులు చేస్తోంది.. నన్ను ఇరికించాలని అధికారిపై ఒత్తిడి తెస్తోంది. మేమంటే మీరు అంతగా ఎందుకు భయపడిపోతున్నారు మోడీజీ?" అని ట్వీట్ చేశారు. అయితే ఆయన ఆరోపణలు నిరాధారమని సీబీఐ ఖండించింది.
ఇదిలాఉండగా...సహారా డైరీల ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దర్యాప్తునకు ప్రధాని మోడీ ఇంతగా ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నా రు. సహారా గ్రూపు విషయంలో ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తున్నదంటూ, తాజాగా ఐటీ సెటిల్ మెంట్ అథారిటీ కూడా మినహాయింపు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 'ఈ ప్రత్యేక మినహాయింపు సహారాకా? లేక మోడీజీకా?.. మోడీజీ.. మీ అంతరాత్మ నిర్మలంగా ఉంటే మీరు విచారణకు ఎందుకు భయపడుతున్నారు?" అని రాహుల్ ట్వీట్ చేశారు.
సహారా గ్రూపుపై 2014 నవంబర్ లో జరిపిన దాడుల్లో దొరికిన డైరీల ఆధారంగా ప్రాసిక్యూషన్ - జరిమానా నుంచి ఇన్‌కం ట్యాక్స్ సెటిల్మెంట్ కమిషన్ (ఐటీఎస్సీ) మినహాయింపు ఇచ్చినట్లు మీడియాలో వచ్చింది. సోదాల్లో లభించిన పత్రాలకు సాక్ష్యాధారాల విలువ లేదని - దానిని ఆదాయం పన్ను శాఖ రుజువు చేయలేదని సహారా గ్రూపు ఇదివరలో ఓ దరఖాస్తు పెట్టుకుంది. తొలుత తిరస్కరించిన ఐటీఎస్సీ.. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 5న తిరిగి స్వీకరించిందని మీడియా కథనం పేర్కొంది. సహారా వాదనతో కమిషన్ ఏకీభవించి మినహాయింపునిచ్చింది. మోడీ గుజరాత్ సీఎంగా సహారా - బిర్లా గ్రూపుల నుంచి నిధులు అందుకున్నారని, దానిపై స్వతంత్ర విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/