మహాకూటమి రూపంలో తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటైన ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాలకు చుక్కలు చూపిస్తోందని అంటున్నారు. తమతో జట్టుకట్టిన పార్టీల్లో ఓ వైపు టీడీపీ మరోవైపు టీజేఎస్ లో కలవరానికి దారితీస్తోంది. ఏకంగా ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టీజేఎస్ లో కీలకపాత్ర పోషిస్తున్న అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. బుధవారం రాజీనామా చేసి బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైనట్టు తెలిసింది.
కూటమిలో భాగంగా 10 నుంచి 12 సీట్లు కావాలని పట్టుబడుతున్న టీజేఎస్ కు - కాంగ్రెస్ కేవలం ఆరు నియోజకవర్గాల్లో పోటీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో మల్కాజిగిరి - మెదక్ - దుబ్బాక - సిద్దిపేట - వర్ధన్నపేట - అంబర్ పేట ఉన్నాయి. మిర్యాలగూడ - వరంగల్ ఈస్ట్ - మేడ్చల్ నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వాలని టీజేఎస్ కోరినా కాంగ్రెస్ నుంచి స్పందన లేదు. అంబర్‌పేటకు బదులు బలమున్నచోట సీటుకావాలని టీజేఎస్ పట్టుబడుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డయిన వరంగల్ ఈస్ట్ సీటును తాము కోరితే టీడీపీకి కేటాయించడంపై టీజేఎస్ తీవ్ర అసహనంలో ఉంది. అంబర్ పేట బదులు ఆ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నది. జనగామ నుంచి బరిలో నిలిచేందుకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సుముఖంగా లేనట్టు సమాచారం.
అయితే, పార్టీకి చెందిన నేతలు మాత్రం టీజేఎస్ రథసారథి తీరుపై భగ్గుమంటున్నారు. సీట్ల సర్దుబాటులో కీలక స్థానాలను అడిగితీసుకోవడంలో కోదండరాం విఫలమయ్యారని పార్టీకి చెందిన సీనియర్ నేత రాజేందర్ రెడ్డి వాపోయారు. అందుకే పార్టీ మారుతున్నట్టు సన్నిహితులకు తెలిపారని సమాచారం. రాజేందర్ రెడ్డి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ - బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డితో పలుదఫాలుగా చర్చలు జరుపగా - టికెట్ ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్టు తెలిసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన టీజేఎస్ సీనియర్ నేత గాలిపెల్లి నాగభూషణ్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. టీజేఎస్ బలోపేతానికి ఆర్థికభారాన్ని లెక్కచేయక శ్రమిస్తూ కార్యకర్తలను కాపాడుకుంటే, కోదండరాం కాంగ్రెస్ కు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.