పండ‌గ‌పూట ర‌జ‌నీ అభిమానులు అలా చేశారు

Update: 2017-10-01 05:06 GMT
జ‌రిగేది తెలుసు. కానీ.. అదెలా జ‌రుగుతుంద‌న్న‌దే ఇప్పుడున్న ఉత్కంట‌. అమ్మ అనారోగ్యంతో త‌మిళ‌నాడులో మొద‌లైన రాజ‌కీయ శూన్య‌త రోజురోజుకీ పెరిగిపోతున్న వైనం తెలిసిందే. ఏ రోజు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. అమ్మ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మిళ‌నాడు వైపు క‌న్నెత్తి చూసేందుకు సైతం భ‌య‌ప‌డేలా చేసేవారు. అలాంటిది ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి.

త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారు  త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. గ‌తంలోనూ ఆయ‌న్ను రాజ‌కీయాల్లో రావాల‌ని కోరినా.. పెద్ద‌గా రియాక్ట్ కాని ర‌జ‌నీకాంత్ ఇప్పుడు మాత్రం త‌న‌కు తానుగా పాలిటిక్స్ లోకి  రావాల‌నుకుంటున్నారు.

అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌ని ర‌జ‌నీకాంత్‌.. బ్యాక్ ఎండ్ లో మాత్రం పార్టీ ఏర్పాటుకు సంబంధించిన క‌స‌రత్తును పెద్ద ఎత్తున చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉండ‌గా..  ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ర‌జ‌నీ అభిమానులు స‌రికొత్త కార్య‌క్ర‌మానికి తెర తీశారు. త‌మిళ‌నాడులోని ర‌జ‌నీకాంత్ అభిమాను సంఘం ముఖ్య‌నేత‌లంతా క‌లిసి ర‌జ‌నీ పేర‌వై పేరిట ఒక వెబ్ సైట్‌ ను ఏర్పాటు చేశారు.

పూర్తిగా త‌మిళంలో ఉన్న ఈ వెబ్ సైట్లో సూపర్ స్టార్ ర‌జ‌నీకి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తారు. బాబా సినిమాలో ర‌జ‌నీ చేసిన ఫిలాస‌ఫిక‌ల్ ముద్ర‌తో పాటు.. త‌మిళ‌నాడు జిందాబాద్.. త‌మిళ్ వ‌ర్దిల్లాలి.. మ‌రింత ఉత్సాహాన్ని నింపేలా నినాదాల్ని సిద్ధం చేయ‌టం క‌నిపిస్తోంది.

ఈ సైట్లో ఒక్కొక్క‌రు త‌మ పేరును న‌మోదు చేసుకోవ‌టానికి ముందు త‌మ‌కు తెలిసిన 10 మందిని ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని కోరుతున్నారు. సైట్ లో పేరు న‌మోదు చేసుకునే వారు.. ప‌ది మందిని ఫాలో అయ్యేలా చేయాలి. ఇంచుమించు స్టాలిన్‌ సినిమాలో మంచిని  అంద‌రితో పంచుకోవాల‌న్న‌ట్లుగా  ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీని ప్ర‌జ‌ల్లోకి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో తీసుకెళ్ల‌ట‌మే కాదు.. పార్టీకి బ‌ల‌మైన అభిమానుల పునాదుల్ని సిద్దం చేయాల‌న్న‌దే తాజా ప్లాన్ గా తెలుస్తోంది. తాజా కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ర‌జ‌నీ రాజ‌కీయ‌పార్టీకి సంబంధించిన కిలక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే విడుద‌ల అవుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News