రజినీ మేనియా అక్కడ మొదలన్నమాట..

Update: 2016-05-22 11:30 GMT
సౌత్ ఇండియన్ సినిమా గురించి ప్రపంచానికి చాటిచెప్పిన తొలి కథానాయకుడు రజినీకాంత్. సూపర్ స్టార్ కంటే ముందు సౌత్ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప నటులున్నా.. వాళ్ల గురించి ప్రపంచానికి తెలియలేదు. విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. సౌత్ సినిమా గురించి వాళ్లకు తెలియనే తెలియదు. అలాంటి సమయంలో జపాన్ లాంటి దేశాల్లో ‘ముత్తు’ సినిమాతో సంచలనం సృష్టించి పెద్ద స్టార్ అయిపోయాడు రజినీకాంత్. ముందు జపాన్ లో.. ఆ తర్వాత సింగపూర్.. చైనా లాంటి మరిన్ని దేశాల్లో పాపులారిటీ సంపాదించాడు సూపర్ స్టార్. ఆయా దేశాల్లో అక్కడి భాషల్లో రజినీ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఇప్పుడిక ఆయన హవా మరో దేశంలోనూ మొదలుకానుంది. తన కొత్త సినిమా ‘కబాలి’తో మలేషియాలోనూ సంచలనం సృష్టించబోతున్నాడు సూపర్ స్టార్.

మలేషియా అధికారిక భాష మళాయ్ లో అనువదించి ‘కబాలి’ని రిలీజ్ చేయబోతుండటం విశేషం. ఇలా మలేషియా భాషలో రిలీజవుతున్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా ‘కబాలి’ రికార్డు సృష్టించబోతోంది. జులై 1న తమిళ-తెలుగు వెర్షన్లతో పాటే ఆ సినిమా కూడా విడుదల కానుంది. ‘కబాలి’ మలేషియా నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో చాలామంది మలేషియా నటీనటులు కూడా కనిపిస్తారు. మలేషియాలో ఉండే తమిళుల కోసం పోరాడే డాన్ పాత్రలో రజినీ నటించాడు. కాబట్టి నేటివిటీ ఫ్యాక్టర్ విషయంలో ఇబ్బంది లేదు. ఇక తమిళులు మలేషియాలో భారీ సంఖ్యలోనే ఉంటారు కాబట్టి.. సినిమాను భారీ స్థాయిలోనే రిలీజ్ చేసుకోవచ్చు. మొత్తానికి ‘కబాలి’ సినిమాతో మలేషియాలోనూ రజినీ మేనియా మొదలుకావడం ఖాయం.
Tags:    

Similar News