తమిళనాట ఎంత వాళ్లయినా సరే జయలలిత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆమెను ప్రసన్నం చేయడానికి ప్రయత్నించాల్సిందే. అమ్మ నుంచి ఏదైనా సాయం పొందడానికి కాకపోయినా.. ఆమె ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండటానికైనా ఓసారి దర్శనం చేసుకుంటే మంచిది. ఇందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మినహాయింపేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు అమ్మను కలిసి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. తాజాగా రజినీకాంత్ సైతం అమ్మ దర్శనం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి 32 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన నాయకురాలిగా చరిత్ర సృష్టించిన అమ్మను రజినీకాంత్ కలిశాడు. పుష్పగుచ్ఛం అందజేసి.. ఆమె సాధించిన చారిత్రక విజయానికి అభినందనలు తెలిపారు.
ఇప్పటిదాకా రజినీకాంత్ కు జయలలితతో ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఒకప్పడు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ తర్వాత రజినీ తటస్థంగా ఉండిపోయాడు. అది జయకు నచ్చింది. రజినీ రాజకీయాల్లోకి వస్తే జయకు ఇబ్బందే. ఆయన అలాంటి ప్రయత్నాలేమీ చేయకుండా తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. జయను కలిసి అభినందనలు చెప్పాడు కాబట్టి ఆమె నుంచి ఆయనకొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఐతే జయ మోనోపలీని తీవ్రంగా వ్యతిరేకించడమే కాక.. కొన్నిసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన కమల్ హాసన్ లాంటి వాళ్లకే ఇబ్బంది తప్పకపోవచ్చు. మరోవైపు జయకు వ్యతిరేకంగా తోక జాడించిన విజయ్ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. సినిమా వాళ్లను అదే పనిగా టార్గెట్ చేయకపోయినా.. ఏదైనా సందర్భం కలిసొస్తే మాత్రం జయ తన పవర్ చూపిస్తుంది.