సూపర్ స్టార్ రజనీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లది నాలుగు దశాబ్దాల స్నేహం. ఇద్దరూ బాలచందర్ ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. చాలా ఏళ్లు కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత సినిమాల పరంగా ఎవరి దారిది వారిదే అయినా.. ఇద్దరి మధ్య పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం మంచి మిత్రులుగా సాగారు. అభిమానుల మధ్య గొడవలున్నప్పటికీ వాళ్ల స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఐతే ఇప్పుడు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వేర్వేరుగా పార్టీలు పెడుతున్నారు. మరి రాజకీయాల్లో కూడా మునుపటి స్నేహమే కొనసాగిస్తారా.. ఒకరినొకరు విమర్శించుకోరా.. పరస్పరం ఆరోపణలు చేసుకోరా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఐతే రజనీ మాత్రం తాము ఇకపైనా స్నేహితులుగానే కొనసాగుతామన్నాడు. ఒకరినొకరు విమర్శలు చేసుకోమన్నారు. తామిద్దరం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేశాక ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి కొందరు గట్టి ప్రయత్నమే చేశారన్నారు. కమల్ ను.. తనను వేరు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నాడు రజనీ. కమల్ తో తన స్నేహం ఈనాటిది కాదన్నాడు రజనీ. సినిమాల విషయంలో తనకు కమల్ ఎంతో సాయం చేశాడన్నాడు. డైలాగుల దగ్గర్నుంచి ఎన్నో విషయాల్లో సాయపడ్డాడన్నారు. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని.. ఇద్దరం ఎవరి దారిలో వాళ్లు వెళ్తామని.. పరస్పర విమర్శలు చేసుకోమని రజనీ స్పష్టం చేశాడు. ఐతే ఇప్పటి పరిస్థితుల్లో ఈ మాట చెప్పొచ్చేమో కానీ.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగి.. ఎన్నికల పోరుకు సిద్ధమయ్యాక కూడా ఇలాగే మిత్రుల్లా కొనసాగడం అంటే అంత సులువు కాదు. మరి రజనీ ఇప్పటి మాటలకు అప్పుడూ కట్టుబడతాడేమో చూద్దాం.