ఫ్యామిలీతో రజనీ.. ప్రధాని కూడానట?

Update: 2016-10-17 04:28 GMT
చెన్నై అపోలో ఆస్పత్రిలో 25 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించడానికి కేంద్రమంత్రులు - రాష్ట్రనేతలు - సెలబ్రెటీలు ఇప్పటికే క్యూ కట్టారు. ఎవరికీ జయలలితను నేరుగా దగ్గరకు వెళ్లి చూసి మాట్లాడే అవకాశం లేకపోయినా అమ్మపై తమకున్న అభిమానంతో కొందరు, మర్యాదపూర్వకంగా మరికొందరు వెళ్లి పరామర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా పరామర్శించగా - కేంద్రమంత్రులు - నాయకులూ కూడా వెళ్లి వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా అమ్మను చూడటానికి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు.

తాజాగా రజనీకాంత్, తన కూతురు ఐశ్వర్య ధనుష్ లు ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ కూడా త్వరలో చెన్నై వచ్చి జయలలితను పరామర్శించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని చెన్నైకి వస్తారని, అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తెలియదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్ చెబుతున్నారు.

కాగా ప్రస్తుతం జయలలితకు ప్రస్తుతం లండన్‌ కు చెందిన వైద్యుడు రిచర్డ్ - ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌ లోని ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన మహిళా వైద్యులు కూడా వీరికి తోడయ్యారని, ఈ సింగపూర్ వైద్యులు జయలలితకు ప్రత్యేక ఫిజియోథెరపీ చికిత్స సాగిస్తున్నారని తెలుస్తోంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News