ర‌జనీ పొలిటిక‌ల్ ఎంట్రీ... ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వ‌చ్చింది?

Update: 2020-12-03 16:00 GMT
దీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న అంశానికి తెర‌ప‌డింది. గ‌త కొద్దికాలంగా తమిళ‌నాడు రాజకీయాల్లోకి సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అతని అభిమానులుఎప్పుడెప్పుడు పార్టీ పెడతాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే, రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాల‌ని డిసైడ‌య్యారు. ఈరోజు ఉదయం అయన ఈమేరకు ఒక ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అదే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ వ్యాఖ్య‌లు సైతం కీల‌కంగా మారాయి.

త‌ను తీసుకున్న కీల‌క నిర్ణ‌యం గురించి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్వీట్లో తెలియ‌జేశారు. తన పార్టీకి సంబంధించిన సమాచారాన్ని డిసెంబరు 31న ప్రకటిస్తానని, పార్టీ వచ్చే ఏడాది జనవరీలో స్థాపిస్తామని రజనీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2021 ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ప్రజలు తన వెంట నడిస్తే మనమంతా కలిసి మార్పును తీసుకొద్దామని రజనీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆదరణతో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని స్పష్టం చేశారు.

తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీకాంత్ అభిమానులకు పిలుపునిచ్చారు. త‌ద్వారా ప్రజా గళమై అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రజనీ పార్టీ పెడుతున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. రజనీ కాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే అతడి కబాలీ సినిమాకు పెద్దపెద్ద సంస్థ‌లు సైతం ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ సినిమా చూసుకోమని చెప్పాయి. ఇలాంటి నేప‌థ్యంలో రజనీ పార్టీకి తమిళ ప్రజల ఆదరణ ఉంటుంద‌న్న‌ది నిజం. అయితే, ఆయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ ఏ వైపు ఉండ‌నుంది?తమిళనాడు రాజకీయ పార్టీలలో పెను సంచలనంగా నిలిచిన ఈ ఘ‌ట‌న‌తో ఏ పార్టీకి న‌ష్టం జ‌ర‌గ‌నుంది? జాతీయ రాజ‌కీయాల్లో ర‌జ‌నీ పార్టీపై స్పంద‌న ఏంట‌నేది వేచి చూడాల్సింది. అంతేకాకుండా రజనీ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News