కొత్త చట్టం వచ్చేసింది. ఇంతకాలం 18 ఏళ్ల లోపు వారు ఎంతటి దారుణ నేరాలు చేసినా వారిని బాలనేరస్తులుగా పరిగణించే వ్యవహారం ఇక ముగిసినట్లే. తాజాగా రాజ్యసభలో 16 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరిని వయోజనులుగా వ్యవహరించటంతో పాటు.. వారు చేసే నేరాలకు మిగిలిన వారికి పడినట్లే శిక్షలు విధించనున్నారు. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించింది. అయితే.. ఈ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీన్ని వ్యతిరేకిస్తూ.. వామపక్షాలు వాకౌట్ చేశాయి.
16 ఏళ్ల వయస్కుల్ని వయోజనులుగా గుర్తించే బిల్లుపై వారు నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. ఈ బిల్లును భావోద్వేగ అంశాలతో ముడిపెట్టారని.. లోతుల్లోకి వెళ్లి చూడాలంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బాల నేరస్తులకు సంబంధించి చట్టాలు మర్చాలని నెత్తినోరు కొట్టుకుంటున్నా.. వామపక్ష వాదులు.. అలాంటి భావజాలం ఉండే వారితో పాటు.. మానవహక్కుల గురించి మాట్లాడేవారికి.. తాజాగా రాజ్యసభ ఆమోదించిన బిల్లు అత్యాచారం.. క్రూరమైన నేరాలు విషయంలోనే నిందితుల వయసును 18 ఏళ్ల నుంచి 16కు తగ్గించారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
క్రూరమైన నేరాలు.. అత్యాచారాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని వామపక్ష నేతలకు అర్థం కాలేదో.. లేక.. అదెంత దారుణంగా ఉంటుందో తెలీదో అన్న భావన వారి వైఖరితో సందేహం రాక మానదు. అందుకే.. అలాంటి వారు చేస్తే ఘోరాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పటానికి.. ఓ రెండు ఉదంతాల్ని చెప్పాల్సిందే. అందులో ఒకటి.. ఒక సామూహిక అత్యాచారంలో అభాగ్యురాలి జననాంగంలో ఇనుప రాడ్ దూర్చి తీవ్రంగా గాయపర్చటం.. మరో ఉదంతంలో.. మానసిక వికలాంగురాలిని దారుణంగా అత్యాచారం చేయటంతో పాటు.. బ్లేడ్ తో శరీరావయువాల్ని కోయటం లాంటివి 18 ఏళ్ల లోపు వయస్కుల వారు చేసినవే. మరి.. ఇంత దారుణమైన నేరాల్ని చేసిన వారి విషయంలో అపారమైన కరుణను ప్రదర్శించే వామపక్ష నేతలు.. బాధితుల గురించి వారేం చెబుతారు? బాధ్యుల గురించి అన్నీ కోణాల్లో ఆలోచించే వారు.. బాధితుల గురించి ఎందుకు ఆలోచించటం లేదు? అన్నది సందేహాలు.
‘‘16’’ దాటితో క్రూరమైన నేరాల విషయంలో వయోజనులకు పడే కఠిన శిక్షలు అమలు చేసే విషయంలో వామపక్షవాదులకు ఉండే అభ్యంతరం ఏమిటి? ‘‘18’’ మీద వారు చూపించే మోజు ‘‘16’’ మీద ఎందుకు చూపించరు? దీనికేమైనా భావోద్వేగ కారణం ఉందా..?