ఉన్నట్లుండి మంచు వారి కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే మోడీ అపాయింట్మెంట్ కష్టంగా ఉందీ రోజుల్లో. అలాంటి సమయంలో రాజకీయాలతో పాటు సినిమాలకూ దూరంగా ఉన్న మోహన్ బాబుకు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ సమయంలో మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి మోడీని ఎందుకు కలిశాడు.. వీళ్ల మధ్య ఏం చర్చ జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది. మిమ్మల్ని మోడీ బీజేపీలోకి ఆహ్వానించారా అని మీడియా వాళ్లు అడిగితే.. దాని గురించి ఏమీ మాట్లాడలేనంటూ మోహన్ బాబు సమాధానం దాటవేశాడు. ఐతే ఢిల్లీ వర్గాల్లో మాత్రం మోహన్ బాబు భాజపాలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. ఆయన తనయురాలు మంచు లక్ష్మికి భాజపా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.
మోహన్ బాబు గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఎప్పుడూ పోటీ పడలేదు. మంచు లక్ష్మి విషయానికి వస్తే ఆమె ఎన్నికల్లో పోటీ పడుతుందంటూ 2014లోనే గుసగుసలు వినిపించాయి. 2019 ఎన్నికల ముంగిట కూడా కొంత ప్రచారం జరిగింది. ఐతే అలాంటిదేమీ జరగలేదు. మోహన్ బాబు - మంచు విష్ణు మాత్రం గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేశారు. జగన్ తో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఏపీలో వైకాపాకు భాజపా శత్రువుగా మారుతున్న సమయంలో మోహన్ బాబు ప్రధానిని కలవడం.. భాజపా మంచు లక్ష్మికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యం కలిగించేే విషయమే. మోహన్ బాబు గతంలో కొంత కాలం భాజపా పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.