సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీలో కీలక మలుపులు చోటుచేసుకునే అవశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తున్న తీరుతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. దీనికి కొనసాగింపుగా మరో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. మెగా ఫ్యామిలీ అంతా జనసేన కోసం శ్రమించే వాతావరణం కనిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనంగా ఉందంటున్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ `బాబాయ్ చాలా కష్టపడుతున్నారు. ఆయన గనుక అనుమతి ఇస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని రామ్ చరణ్ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ప్రచారం చేద్దామనుకున్నానని...కానీ, అప్పుడు బాబాయ్ పవన్ కల్యాణ్ వద్దన్నారని పేర్కొంటూ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే జనసేనకు ప్రచారం చేస్తానని అన్నారు. పవన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. జనసేన కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కతాటిపైకి రానుందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అంతా కలిసి ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషిస్తున్నారు.
ఇదిలాఉండగా...మెగాస్టార్ చిరంజీవి సైతం తన సోదరుడి పార్టీ కోసం తెరమీదకు వస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇందకు పలు అంశాలను విశ్లేషిస్తున్నారు. దాదాపు దశాబ్దం కిందట చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పార్టీ పరిమితం అయ్యింది . ఆ తర్వాత కొంతకాలానికే వివిధ పరిణామాల మధ్యన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో...చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో...చిరు పొలిటికల్ కెరిర్ ఇక ముగిసినట్లేనని కొందరు అంటున్నారు. అయితే తన సోదరుడు - పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీకి చిరు సేవలు అందించనున్నారని - జనసేనకు సలహాదారుగా ఉంటారని కొందరు జోస్యం చెప్తున్నారు.