టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు. గతంలో పవన్ చిత్రాలతో పాటు పవన్ పాలిటిక్స్ పైనా సెటైర్ల మీద సెటైర్లు వేసిన వర్మ... తనదైన శైలిలో వివాదాన్ని చాలా పెద్దదిగానే చేశారు. అసలు పవన్ - వర్మ ఇద్దరూ ప్రత్యక్షంగా ఎదురుపడితే... తిట్టేసుకోవడంతో పాటు కొట్టేసుకుంటారేమోనన్న స్థాయికి ఆ వివాదం వెళ్లిపోతే... ఇక తన సోదరులను ఎవరైనా ఏమన్నా కూడా ఏమాత్రం సహించేది లేదన్న రీతిలో వ్యవహరించే పవన్ అన్న నాగబాబు... బహిరంగ వేదికపైనే వర్మపై విరుచుకుపడిపోయారు. అయినా కూడా పవన్ ను వర్మ వదిలిపెట్టలేదు. అయితే ఆశ్చర్యంగా.. ఎప్పుడూ పవన్ పై విమర్శలు గుప్పించే రీతిలోనే సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వర్మ... ఒక్కోసారి పవన్ నటన అంటే తనకు ఇష్టమని, పవన్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. అయినా ఇప్పుడు మళ్లీ వర్మ... పవన్ పై ఏమన్నా అన్నాడా? అంటే... అన్నారు కాబట్టే ఇప్పుడు వీరిని ప్రస్తావించుకోవాల్సి వచ్చింది.
అయితే తాజాగా పవన్ పై వర్మ ఎలాంటి కామెంట్లు చేశారన్న విషయానికి వస్తే... గతంలో చేసిన కామెంట్ల కంటే కూడా కాస్తంత గాఢత ఎక్కువగానే ఉన్న కామెంట్లు చేశారని చెప్పాలి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వరుసగా రెండు ట్వీట్లను వదిలిన వర్మ.. పవన్ పొలిటికల్ ఇమేజీని బాగానే డ్యామేజీ చేశారనే చెప్పాలి. అయినా సదరు ట్వీట్లలో పవన్ పై వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే... *హైదరాబాద్ నోవాటెల్ లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్ కల్యాణ్ సింహంలా గర్జించాడనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. అతనూ చిరంజీవిలా మారిపోతున్నాడేమో అనిపిస్తుంది* - *నెమ్మదిగా చిరులా మారిపోతున్న పవన్.. తన జనసేన పార్టీని ప్రజారాజ్యం కంటే చెత్తగా తయారుచేసుకుంటున్నాడని.. ఈ విషయంలో ఏపీ ప్రజల తరపున తాను ప్రార్థిస్తున్నా* అని ఆ ట్వీట్లలో వర్మ వ్యాఖ్యానించారు.
మొత్తానికి పవన్ ను తాను సింహంగానే భావించానని - అయితే ఇప్పుడు అదే పవన్... తన సోదరుడు మోగాస్టార్ చిరంజీవిలా మారిపోతున్నాడని - తన జనసేన పార్టీని ప్రజారాజ్యం పార్టీ కంటే కూడా చెత్తగా తయారు చేసేస్తున్నారని కూడా వర్మ దెప్పి పొడిచారు. మొత్తంగా ఈ రెండు ట్వీట్ల ద్వారా పవన్ తో పాటుగా చిరుకు కూడా కాలేలా వర్మ వ్యాఖ్యలు చేశారని చెప్పక తప్పదు. సింహంలా గర్జించిన పవన్ ఇప్పుడు చిరులా మారిపోతున్నాడని చెప్పడం ద్వారా... చిరు వైఫల్యం చెందారని, చిరును చాలా తక్కువగా చేసి వర్మ మాట్లాడారని కూడా చెప్పక తప్పదేమో.మరి ఈ ట్వీట్లపై పవన్, చిరుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.