వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యూహం, శపథం అనే సినిమాలు ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను రాయలసీమకు చెందిన వైసీపీ నేత ఒకరు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల విషయం చర్చించడానికే ఇటీవల రామ్ గోపాల్ వర్మ గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఇక అప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ మళ్లీ పొలిటికల్ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నాడు అంటూ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్భంగా కాపులకు రిప్.. కమ్మోళ్లకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు.
వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఓవైపు కాపు సంఘాలు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు దుమ్మెత్తి పోశారు. రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా వర్మ ఈ విమర్శలకు ఏమీ వెరవలేదు. మళ్లీ మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు.
ఇక రాంగోపాల్ వర్మ ట్వీట్ పై రెండు పార్టీల శ్రేణులతో కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన తటస్తులు సైతం మండిపడ్డారు. వర్మ చేసిన ట్వీట్లు రెండు కులాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ధ్వజమెత్తుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తీవ్ర చర్యలకు దిగారు. రామ్ గోపాల్ వర్మ మరణించాడని చెబుతూ అతడికి దశ దిన కర్మ సైతం నిర్వహించారు. ఈ మేరకు రోడ్లపై రామ్ గోపాల్ వర్మ బ్యానర్లు కట్టి.. వాటికి పూల దండలు వేశారు. ఆ బ్యానర్లపైన వర్మ దశ దిశ కర్మ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. గత కొద్ది రోజులుగా తాను చేసిన ట్వీట్లన్నీ పవన్ కల్యాణ్ అభిమానిగానే చేశానన్నారు. వాటిని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు.
ఇటీవల తాను జనసేన, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు పవన్ అభిమానిగా చేశానని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ ట్వీట్లు అర్థం చేసుకోకపోవటం తన దురదృష్టకరమన్నారు. అంతకన్నా పవన్ కల్యాణ్ దురదృష్టకరమని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.