కొందరు కొన్ని విషయాల్లో రాణించినంతగా.. ఇతర విషయాల్లో రాణించలేరు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు కేఏ పాల్. ఒకప్పుడు తన సొంత హెలికాఫ్టర్ లో పాల్ నడిపించిన హవా ఒక స్థాయిలో ఉండేది. అతగాడిని కలుసుకునేందుకు ప్రముఖులు బారులు తీరేవారు. ఈ మత ప్రభోదకుడు గురించి కథలు.. కథలుగా చెప్పేవారు.
ఎప్పుడైతే తన పని వదిలేసి..రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి పాల్ పరిస్థితి ఎలా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇది సరిపోనట్లు.. మీడియాతో కేఏ పాల్ చేసే వ్యాఖ్యలు.. అవి ప్రముఖంగా రావటం ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అతగాడి మాటలు ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇదిలా ఉంటే.. ప్రముఖ దర్శకుడు.. వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రాంగోపాల్ వర్మ తాజాగా కేఏ పాల్ మీద వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. అసలే వర్మ.. ఆ పై కేఏ పాల్ మీద విమర్శలంటే అవెలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.
ఇంతకీ పాల్ ను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఏపీకి కాబోయే సీఎం కేఏ పాల్ అని.. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాల్లోనూ పాల్ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందన్నారు. జీసస్ క్రైస్ట్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తి కేఏ పాల్ అన్న వర్మ.. ప్రధాని మోడీతో పాల్ కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు
ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి లీడర్ కావటానికి బదులుగా.. చంద్రబాబు.. వైఎస్ జగన్.. నరేంద్ర మోడీ.. డొనాల్డ్ ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీ పడటానికి బదులుగా.. తన మిత్రుడైన జీసస్ ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి.. ప్రపంచ నేతగా కేఏ పాల్ ఎదగాలన్న ఆకాంక్షను వర్మ వ్యక్తం చేశారు. మొత్తానికి తనలోని ఎటకారం ఏ స్థాయిలో ఉంటుందో కేఏ పాల్ మీద తాజాగా సంధించిన ట్వీట్లను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.