పాకిస్తాన్ లో రాంమందిర్ కూల్చివేత

Update: 2020-10-11 14:59 GMT
పాకిస్తాన్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఆదేశంలో మైనార్టీలైన హిందువుల మనోభావాలకు విలువ లేకుండా పోతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో అనేక హిందూ ఆలయాలను కూల్చివేశారు. ఒక్క కొత్త దేవాలయం నిర్మించకపోగా.. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పురాతన ఆలయాలు కూడా కూల్చేస్తున్నారు.

ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో ఆలయాలపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైనట్టు లండన్ బేస్డ్ పాకిస్తానీ యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ తెలిపారు.

కాగా ఈ దారుణాలపై పాకిస్తాన్ లోని మిందూ దేవాలయాలు ఫిర్యాదులు చేసినా పాకిస్తాన్ సర్కార్ పట్టించుకోవడం లేదని యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ ఆరోపించారు.

సింద్ ప్రావిన్స్ లో గతంలో 428 హిందూ ఆలయాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 20కి పడిపోయిందని.. భవిష్యత్ లో ఈ మందిరాలు కూడా ఉంటాయనే నమ్మకం లేదని అనిలా గుల్జార్ పేర్కొన్నారు.

కాగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడులు మరింత ఎక్కువైనట్టు హిందుత్వవాదులు మండిపడ్డారు. హిందువులపై ఇమ్రాన్ సర్కార్ సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News