రామ‌సుబ్బారెడ్డిని బాబు ఎందుకు పిలిపించాడో

Update: 2017-07-01 13:53 GMT
పార్టీలోని లుక‌లుక‌ల‌ను చ‌క్క‌దిద్దేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క్రియాశీలంగా  అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించ‌డం, పార్టీలో ఉన్న నేత‌ల‌ను ప‌ట్టించుకోని నేప‌థ్యంలో అసంతృప్తులు తారాస్థాయికి చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ సీనియ‌ర్ నేత శిల్పామోహ‌న్ రెడ్డి పార్టీ మార‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డినితో టీడీపీ అధినేత‌ - సీఎం చంద్రబాబునాయుడు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు.

ప్ర‌తిప‌క్ష వైఎస్‌ ఆర్‌ సీపీ నుంచి గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో తీసుకోవడంతో పాటు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో గవర్నర్‌ కోటాలో టికెట్‌ ఇస్తానని రామసుబ్బారెడ్డికి సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నిల‌బెట్టుకోవ‌డంలో బాబు జాప్యం చేస్తున్నార‌ని రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు భావిస్తున్నారు. హామీ తర్వాత మహానాడు సమయంలో రామసుబ్బారెడ్డి టీడీపీ కార్యకర్తలతో సమావేశమం ఇందుకు నిద‌ర్శ‌నంగా ప‌లువురు చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో రామసుబ్బారెడ్డితో చంద్రబాబు అమ‌రావ‌తిలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ యువ‌నేత నారా లోకేష్‌ - ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు సైతం ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా రామ‌సుబ్బారెడ్డి త‌న అసంతృఫ్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా ప‌ద‌వి ఇవ్వ‌డంలో జాప్యం జ‌రుగుతండ‌టంపై కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తి రేగుతోంద‌ని తెలిపిన‌ట్లు స‌మాచారం. దీనికి స్పందించిన చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే న్యాయం చేయ‌నున్న‌ట్లు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News