కోరోనిల్‌తో వైరస్ భాదితులు కోలుకున్నారు ...ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబా !
ప్రస్తుతం మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారి కరోనాకు ఆయుర్వేద మెడిసిన్ తో చెక్ పెట్టవచ్చంటూ ఇటీవల పతంజలి సంస్థ తెలిపింది. అంతేకాదు కోరోనిల్ అనే వైరస్ కిట్ ను కూడా విడుదల చేసింది.
అయితే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కేంద్ర ఆయుష్ డిపార్ట్‌మెంట్ దీనికి బ్రేకులు వేసింది. అంతే కాదు పతంజలి సంస్థకు నోటిసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాడు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ కరోనాకు తాము మందును కనుగొనలేదని బదులిచ్చారు. అయితే తాజాగా బుధవారం నాడు.. యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి తాము తయారు చేసిన మెడిసిన్ ద్వారా కరోనా సోకిన పేషెంట్లు కోలుకున్నారని బదులిచ్చారు.
తమ పరిశోధనలో 67 శాతం మంది మూడు రోజుల్లోనే కోలుకోగా.. ఏడు రోజుల్లో వంద శాతం కోలుకున్నారని తెలిపారు. అంతేకాదు తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయుష్ మంత్రిత్వ శాఖకు అందజేశామని తెలిపారు. తాము చేసిన ట్రయల్స్ లో 45 మంది వైరస్ సోకిన పేషెంట్లు త్వరగానే కోలుకున్నారని.. అందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని రాందేవ్ చెప్పుకొచ్చారు.