తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్ మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఆయన్ను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు షురూ అయ్యాయి. సమతామూర్తి ప్రారంభోత్సవ సమయంలో రామేశ్వరరావుకు సీఎం కేసీఆర్ కు విభేదాలు వచ్చినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.
ప్రస్తుతం వారిద్దరికి మధ్య దూరం పెరిగిందన్న వేళ.. ఆ దూరాన్ని తమకు దగ్గరయ్యేలా కమలనాథులు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఆయన్ను బీజేపీలోకి చేర్చుకోవాలని బలంగా భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం.. ఆయన సేవల్ని పార్టీకి ఎలా వినియోగించుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరి.. దీనికి రామేశ్వరరావు ఎలా రియాక్టు అవుతారన్న దానిపై ఇప్పుడు ఆసక్తి వ్యక్తమవుతోంది. వాస్తవానికి బీజేపీకి రామేశ్వరరావుకు మధ్య అనుబంధం కొత్తేం కాదంటున్నారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ముందు నుంచే మంచి సంబంధాలు ఉంటే.. గ్రేటర్ ఎన్నికల వేళలో అవి కాస్తా మరింత బలపడటంతో పాటు.. రామేశ్వరరావు శక్తి సామర్థ్యాలు పార్టీకి ఏ రీతిలో ఉపయోగపడతాయన్న దానిపై బీజేపీ అధినాయకత్వానికి క్లారిటీ వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణను టార్గెట్ చేసుకున్న మోడీషాలకు.. రామేశ్వరరావు లాంటి కీలక పారిశ్రామికవేత్త పార్టీలో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉండటంతో పాటు ఉభయ తారకంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఆయనకు గాలం వేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ ఆఫర్ కు మైహోం రామేశ్వరరావు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే..ఆయన్ను ఎక్కడ నుంచి నామినేట్ చేయాలన్న దానిపై కసరత్తు తుదిదశలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వినిపిస్తున్న దాని ప్రకారం..బీజేపీలోకి మైహోం రామేశ్వరరావు ఎంట్రీ ఇస్తే మాత్రం.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు భారీ ఎత్తున మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.