నిజమే.. గాంధీ జీవితం మీద తీసే సినిమాకు గాడ్సే సలహాలు తీసుకుంటే ఎలా ఉంటుంది? అదెలా కుదురుతుందన్న మాట ఎవరి నోటి నుంచైనా వస్తుంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ అలాంటి సందేహాన్నే పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర సమాచారాన్ని సేకరించేందుకు తాజాగా చిత్ర బృందం సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ బయోపిక్ కు చంద్రబాబు భేటీ కావటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి చంద్రబాబుకు తెలిసినన్ని విషయాలు మరెవరికీ తెలియవన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. ఆయన చేతిలో నుంచి అధికారాన్ని బాబు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఎపిసోడ్ లో బాబును ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన విమర్శలు.. ఆరోపణలు ఎవరూ మర్చిపోలేరు.
మరి.. అలాంటప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు చంద్రబాబు సలహాలు తీసుకోవటం సరైనదేనా? అన్న ప్రశ్నను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతిలో ఎన్టీఆర్ కుమారుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే.. బాబు వియ్యంకుడు బాలయ్యతో పాటు ప్రముఖ దర్శకుడు క్రిష్.. హీరో రానా.. ఎన్టీఆర్ బయోపిక్ టీం సమావేశమైంది. ఎన్టీఆర్ నాటి వారితో మాట్లాడి వారి నుంచి సమాచారం సేకరించటం ద్వారా మరింత ఎఫెక్టివ్ గా సినిమా తీయాలన్న ఆలోచనతోనే బాబుతో మాట్లాడినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ మూవీని ఎలా తీయాలన్నది బాబును ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ తీరును పలువురు తప్పు పడుతూ..గాంధీ సినిమా కోసం గాడ్సే సలహాలు తీసుకుంటారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత.. సినిమా.. రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచారం తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఆ మాటకు వస్తే.. చాలామంది సీనియర్ జర్నలిస్టులకు కూడా బాగా తెలుసు. ఒకవేళ సినిమా బాగా రావటం కోసం.. సమగ్ర సమాచారం కోసం ప్రయత్నం చేయటమే లక్ష్యమైతే.. ఆ దిశగా ప్రయత్నించాలే కానీ.. బాబు నుంచి ఇన్ పుట్స్ తీసుకోవటం అంటే.. అది ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదన్న మాట వినిపిస్తోంది.