ఈ మధ్య కాలంలో బాహుబలి-2 సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన చిత్రం `పద్మావత్` అనడంలో ఎటువంటి సందేహం లేదు. జక్కన్న చెక్కిన సినీ శిల్పం`బాహుబలి-2`లో.....బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న విషయం తెలుసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకూ ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే, పద్మావత్ లో రాణి పద్మావతి పాత్రను వక్రీకరించారన్న రాజ్ పుత్ ల వాదనలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఇప్పటికే ప్రీమియర్లు చూసేసిన క్రిటిక్స్ ....ఆ సినిమాలో రాజ్ పుత్ - రాణి పద్మావతిపై అభ్యంతరకర సన్నివేశాలు లేవని రివ్యూలిచ్చారు. అయినప్పటికీ నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పద్మావత్ పై కర్ణి సేన, తదితరులు చేస్తున్న రచ్చపై ప్రపంచ మీడియా ఫోకస్ చేసింది. తమకు తోచిన పాయింట్ ను హైలైట్ చేస్తూ రకరకాల కథనాలను పలు దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. అయితే, శ్రీలంక నుంచి వెలువడుతున్న ‘ది మిర్రర్’ పత్రిక ప్రచురించిన కథనం అన్నింటిలోకెల్లా ప్రత్యేకంగా నిలిచింది. ఆ సినిమాను వీక్షించేందుకు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఉవ్విళ్లూరుతున్నారని ఆ కథనంలో ప్రచురించడం సంచలనం రేపింది.
`పద్మావత్` పై మిర్రర్ ఓ ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. రాణి పద్మావతిని సింహళ (శ్రీలంక) రాజ కుమారిగా చూపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ సినిమాను వీక్షించేందుకు శ్రీలంక ప్రధాని రణిల్ ఎదురు చూస్తున్నారని పేర్కొంది. అంతేకాదు, ఆ సినిమా చూసేందుకు భారత ప్రధాని మోదీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. కొద్దిరోజుల క్రితం భారత్ లో పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్ లో ఓ సాంస్కతిక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా పద్మావతి సినిమాలోని ఘూమర్ పాటను విద్యార్థులు ప్రదర్శించారని, అది మోదీకి బాగా నచ్చిందని పేర్కొంది. ఆ పాటను మోదీ వీక్షించిన అంశం కూడా వివాదాస్పదమైందని, దానిపై స్పందించని మోదీ....తాజాగా ఆరేడు రాష్ట్రాల్లో చెలరేగుతున్న అల్లర్లపై స్పందిస్తారని భావించలేమని షాకింగ్ వ్యాఖ్యలను ప్రచురించింది.
బుధవారం నాడు ప్రధానంగా రాజస్థాన్ - గుజరాత్ - హర్యానా - మధ్యప్రదేశ్ - గోవా రాష్ట్రాల్లో కర్ణిసేన విధ్వంసాలపై జాతీయ - అంతర్జాతీయ మీడియా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రకరకాల కథనాలను ప్రసారం చేసింది. గుర్గావ్ లో పిల్లల స్కూల్ బస్సు పై కర్ణిసేన రాళ్ల దాడి - ప్రాణభయంతో సీట్ల కింద నక్కిన పిల్లల ఫొటోలను అంతర్జాతీయ మీడియా హైలైట్ చేసింది. అహ్మదాబాద్ లో 200 బస్సులను దగ్ధం చేసిన ఘటనలపై బంగ్లాదేశ్‌లోని ‘ది ఇండిపెండెంట్’ - ‘ప్రోథమ్ హాలో’ పత్రికలు ఫోకస్ చేశాయి. కేవలం క్రిటిక్స్ రాసిన సినిమా రివ్యూలను పాక్ కు చెందిన ‘ది డాన్’ ప్రచురించింది.
`పద్మావత్` వివాదాస్పదం అవడానికి కారణాలపై అమెరికాకు చెందిన `న్యూయార్క్ టైమ్స్’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2000 మంది ‘ఆత్మార్మణం’ చేసుకుంటాన్న హెచ్చరికలను ఫోకస్ చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. కానీ, ఈ చిత్ర విడుదలకు వ్యతిరేకంగా...థియేటర్లపై దాడులు - ఆస్తుల ధ్వంసాన్ని కర్ణిసేన కొనసాగిస్తూనే ఉంది.