రంజన్ గొగొయ్ రిటైర్.. నూతన సీజేఐ బోబ్డే చరిత్రిదే..

Update: 2019-11-18 06:07 GMT
త్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం, రాఫెల్, శబరిమల వివాదం, కశ్మీర్ విభజన సహా దేశ చరిత్రలోనే ఎన్నో చారిత్రక తీర్పులను అత్యంత ధైర్యసాహసాలతో ఇచ్చి సుప్రీంకోర్టు చరిత్రలో చెరగని ముద్ర వేశారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ఆయన పదవీ కాలం నిన్న ఆదివారంతో ముగిసిపోయింది. 2018అక్టోబర్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన గొగోయ్ 13 నెలల పాటు సీజేఐగా కొనసాగారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన ఈ తొలి ఈశాన్య రాష్ట్రాల చీఫ్ జస్టిస్  డేర్ మ్యాన్ గా నిలిచారు.

ఆదివారం రిటైర్ అయిన రంజన్ గొగోయ్ ఆయన సొంత రాష్ట్రం అస్సాంలో భావి జీవితం గడుపనున్నారు. అయితే అయోధ్య, కశ్మీర్ సహా ట్రిపుల్ తలాక్ వంటి వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో రంజన్ గొగోయ్ కు కేంద్రం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఆయన అస్సోంలోని ఇంటికి పూర్తి భద్రతను కల్పించారు.

*నూతన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బోబ్డే..
రంజన్ గొగోయ్ వారసుడిగా సుప్రీం కోర్టు 47వ నూతన చీఫ్ జస్టిస్ గా సోమవారం సుప్రీం కోర్టులో  జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే కొద్ది సేపటి క్రితమే బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన బోబ్డే సుమారు 17 నెలల పాటు చీఫ్ జస్టిస్ గా ఉంటారు. 2021 ఏప్రిల్ 23వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అయోధ్యపై తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల్లో బోబ్డే కూడా ఒకరు కావడం గమనార్హం.

*బోబ్డే బయోడేటా..
- 1956 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించారు. ప్రస్తుతం ఈయన వయసు 63 ఏళ్లు.
- మహారాష్ట్రలోని న్యాయవాదుల కుటుంబంలో బోబ్డే జన్మించాడు. ఈయన తాత లాయర్.  బోబ్డే తండ్రి మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా 1980-85 మధ్యకాలంలో చేశారు.
-బోబ్డే సోదరుడు కూడా సుప్రీం కోర్టులో లాయర్ గా ఉన్నారు.
-నాగపూర్ లోని ఎస్ఎఫ్ సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన బోబ్డే డా. అంబేద్కర్ లాకాలేజీ నాగపూర్ యూనివర్సిటీలో 1978లో లా కోర్సు పూర్తి చేశారు.
-1978 సెప్టెంబర్ 12న న్యాయవాద వృత్తిని చేపట్టారు. ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.
-2000 మార్చి 29న ఈయనను ముంబై హైకోర్టులో జడ్జిగా నియమించారు.
- ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైక్టోరు చీఫ్ జస్టిస్ గా గతంలో పనిచేశారు. సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు.

 - న్యాయవాది వృత్తి చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.
Tags:    

Similar News