ఏపీలో ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు

Update: 2016-09-23 08:17 GMT
 ఏపీలో పాలక పార్టీ నేతల కుమారుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి.  గతంలో మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్ హైదరాబాద్ లో ఒక మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో నిర్భయ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యే కుమారుడు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడిపై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడు రాజాబాబు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో రాజాబాబుపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేశారు.  వైద్య పరీక్షల కోసం ఆ గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
Tags:    

Similar News