అనుమతి లేకుండా ర్యాపిడ్‌ టెస్టులు .. గోల్ మాల్ చేస్తున్న ప్రైవేట్‌ లేబొరేటరీలు !

Update: 2020-09-05 07:50 GMT
తెలంగాణ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు ఓ వైపు పెరుగుతూ భయపెడుతుంటే మరోవైపు కొన్ని ప్రైవేట్ లాబ్స్ కరోనా టెస్టుల పేరుతో ప్రజల నుండి వేలకి వేలు లాగేస్తున్నాయి. కనీసం పర్మిషన్ కూడా లేని కొన్ని లాబ్స్ .. కరోనా టెస్టులు నిర్వహిస్తూ , ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ ను ప్రభుత్వానికి అందించడం లేదు. దీనితో వారి వల్ల మరికొందరికి కరోనా అంటుకునే అవకాశం ఉంది.   రాష్ట్రంలో చాలా ప్రైవేట్‌ లేబొరేటరీల్లో  కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలప వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది.

తెలంగాణ  రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 35 డయాగ్నస్టిక్‌ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్‌ టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్‌ టీ– పీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్‌ నంబర్‌ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్‌ సైట్లో ముందుగా అప్‌ లోడ్‌ చేయాలి. తక్షణమే ఆ ఫోన్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్‌ సైట్లో ఒక కోడ్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్‌ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇదేకాక , ఆర్ ‌టీ–పీసీఆర్‌ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్‌ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్‌ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్‌ టీ–పీసీఆర్‌ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్‌ లేకుండా ఇచ్చే టెస్ట్‌ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే అసలు వారు చేసిన టెస్టుల్లో ఎంతమందికి పాజిటివ్ ఉందొ కూడా తెలియడంలేదు. ర్యాపిడ్‌ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. అయితే , ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో ఒక లెక్కాపత్రం లేదు. . ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్‌ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్‌ లేబొరేటరీలకు వరంగా మారింది.
Tags:    

Similar News