గడిచిన మూడు రోజులుగా సంచలనంగా మారటమే కాదు.. రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన నరసాపురం ఎంపీ రఘురామ ఎపిసోడ్ కు సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాటిక్ సీన్లతో పోటాపోటీగా సాగిన ఈ పరిణామాల్ని నిశితంగా చూస్తే.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో రఘురామ విషయంలో పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇంత వేగంగా.. రిలీఫ్ పొందటం అందరికి సాధ్యమయ్యే పని కాదు.
అందునా.. ఏపీ సీఐడీ అధికారులు పట్టుదలగా వ్యవహరిస్తూ.. ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి.. ఎంపీ రఘురామ తాను అనుకున్నది చేసుకోగలిగారన్న మాట వినిపిస్తోంది. తన పుట్టిన రోజున హైదరాబాద్ లో అనూహ్యంగా అరెస్టు అయిన ఆయన.. 72 గంటల వ్యవధిలో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేయటం ఒక ఎత్తు అయితే.. ఆయన అరెస్టు.. అనంతరం సికింద్రాబాద్ కు పంపించిన తీరు మరో ఎత్తుగా చెప్పక తప్పదు.
మరెవరికి సాధ్యం కాని రీతిలో కొన్ని రేర్ సీన్లు చోటు చేసుకున్నాయని చెప్పాలి. రఘురామ అక్రమ అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన ఆయన తరఫు న్యాయవాదులు.. గుంటూరుజైలు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేలా నిర్ణయం తీసుకురావటం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..గుంటూరు జైల్లో ఉన్న రఘురామను సికింద్రాబాద్ కు తరలించేందుకు ఏపీ సీఎస్ తో సహా.. మరో నలుగురు కీలక అధికారులు స్వయంగా పర్యవేక్షించాల్సి రావటం చాలా అరుదుగా చెబుతున్నారు.
అంతేకాదు.. గుంటూరు నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ కు తరలిస్తున్న రఘురామ వ్యవహారంపై తెలంగాణ సీఎస్ తోనూ.. ఏపీ సీఎస్ మాట్లాడాల్సి రావటం.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి రావటం చూసినప్పుడు ఇలాంటివి మరే రాజకీయ నేత విషయంలో సాధ్యం కాదనిపించక మానదు. వరుస రేర్ సీన్లతో.. సినిమాటిక్ పరిణామాలతో రఘురామ ఎపిసోడ్ ఉందని చెప్పక తప్పదు.