కరోనా జోరు దేశంలో మళ్లీ మునుపటి రోజులని గుర్తుకు తెస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా వైరస్ బారిన పడ్డారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యానికి గురైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స ను అందిస్తున్నారు.
శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నాకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రష్మీ థాకరే ఈ నెల 23వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమించింది. వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో నీరసానికి గురయ్యారు. దీనితో ఆమెను మంగళవారం రాత్రి హెచ్ ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమ కుమారుడు, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆయన కోలుకుంటున్నందున.. హోమ్ క్వారంటైన్ లోనే కొనసాగుతున్నారు. కరోనా బారిన పడిన సీఎం భార్య రష్మీ ఠాక్రే ప్రభుత్వం ఆధీనంలోని జేజే ఆసుపత్రిలో మార్చి 11వతేదీన కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా టీకా వేయించుకున్నా రష్మీఠాక్రేకు కరోనా సోకింది. వ్యాక్సిన్ వేయించుకున్న సరిగ్గా 11వ రోజే రష్మీ థాకరే కరోనా వైరస్ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత.. ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ మొదట వెల్లడించారు. అదే సమయంలో వైరస్ సోకడం కలకలం రేపుతోంది. వ్యాక్సిన్ వేయడానికి ముందే కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం రష్మీ థాకరే ఆరోగ్యం బాగుందని, నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు తెలిపారు.