భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా నేడు 85 వ వడిలోకి అడుగు పెడుతున్నారు. వేల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. సామాన్యుడిలానే జీవించేందుకు మక్కువ చూపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 157 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన టాటా గ్రూప్ సంస్థలకు ఆయన ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
వ్యాపార రంగంలో రతన్ టాటా ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మూలాలను మాత్రం మర్చిపోలేదు. మానవత్వం.. దానగుణంలో రతన్ టాటాకు మించిన వారు లేరు. అందుకే ఆయన వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ దానాల కారణంగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రతన్ టాటా పేరు విన్పించదు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.
రతన్ టాటా నావల్ టాటా, సూనీ టాటాల సంతానం. 28 డిసెంబర్ 1937న రతన్ టాటా ముంబైలో జన్మించారు. 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. టాటా గ్రూప్ అప్పటికే పేరొందినప్పటికీ ఆ సంస్థలో సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు.
1970లో టాటా స్టీల్‌లో చేరారు. ఈ క్రమంలోనే 1991లో టాటా గ్రూప్ మొత్తం బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి టాటా గ్రూప్ ప్రస్థానం మరో స్థాయికి ఎదిగింది. టాటా సాల్ట్ తో మొదలైన వ్యాపారం అంచెలంచెలుగా అనేక రంగాలకు విస్తరించింది. కాఫీ.. వాటర్.. టీ.. వాచ్.. జువెలరీ.. కార్లు.. బస్సులు.. ట్రక్కులు.. విమానం వంటి 17 రకాల రంగాల్లో టాటా గ్రూప్ విస్తరించింది.
157 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న టాటా గ్రూప్ కింద 17 కంపెనీలు ఇండియన్ స్టాక్ మారెట్లో విస్తరించి ఉన్నాయి. భారత జీడీపీలో టాటా గ్రూప్ వాటా సుమారు 2 శాతంగా ఉండటం విశేషం. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ చూస్తే 240 బిలియన్ డాలర్లు కాగా 9లక్షల 35 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
రతన్ టాటా సైతం యవ్వనంలో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి మాత్రం చేసుకోలేదు. తాను లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు ఓ యువతిని ప్రేమించానని రతన్ టాటా ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే తన నానమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియాకు రావాల్సి వచ్చిందని తెలిపాడు.
తాను ప్రేమించిన అమ్మాయి సైతం తనతో ఇండియాకు వచ్చేందుకు రెడీ అయిందని తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా మధ్య వార్ కారణంగా తన ప్రేమకు పుల్ స్టాప్ పడిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు వచ్చేందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. దీంతో ఆయన పెళ్లి చేసుకుండానే ఉండిపోయినట్లు చెప్పుకొచ్చారు.
రతన్ టాక్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాతృత్వంలో ఆయన ఎల్లప్పుడు ముందుంటారు. టాటా ట్రస్ చైర్మన్ గా కొనసాగుతున్న రతన్ టాటా ముంబై ఉగ్రదాడి.. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం టాటా ఆస్తులు 3వేల500 కోట్లు కాగా ఎక్కువ శాతం విరాళాలకే ఖర్చు చేస్తుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.