మోడీపై టాటా ఫైర్

Update: 2016-11-25 09:47 GMT
పెద్దనోట్ల రద్దు జాతీయ విపత్తుకు దారి తీసేలా ఉందని ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అన్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని - నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యంగా - వైద్యపరమైన అవసరాలకు సరైన సమయంలో వారికి డబ్బులు అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు.

కాగా టాటాలు బడా పారిశ్రామికవేత్తలయినప్పటికీ మిగతా వ్యాపారవేత్తలకు వారికి చాలా తేడా ఉంది. వారిలో మానవీయ కోణం అధికమని.. సేవాగుణమూ ఉందనిచెబుతారు. సామాన్యులు - తమతో వ్యాపారం చేసేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని చెబుతారు.

మరోవైపు నల్లధనం భారీగా పోగేసుకున్న బడా పారిశ్రామికవేత్తలుకూడా ఈవిషయంలో కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా నిర్ణయాన్ని స్వాగతిస్తున్న క్రమంలో టాటాలు మాత్రం ప్రజల ఇబ్బందులపై నిర్మొహమాటంగాస్పందించడం విశేషం.  వైద్యపరమైన సేవలకు డబ్బుల్లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసరాలు కొనలేక పోతున్నారని, టాటా కేంద్రం దృష్టికి తెచ్చారు.  సంస్థలో అనేక సమస్యలతో సతమతం అవుతున్న సమయంలోనూ దేశంపై తీవ్ర ప్రభావం చూపించిన అంశంపై రతన్ టాటా తనదైన కోణంలో స్పందించడం గొప్ప విషయమే మరి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News