ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం, వసతుల సంగతి దేవుడెరుగు. ఈ వార్త తెలిస్తే కనీసం అక్కడ మనుషుల ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదన్న సంగతి అర్థమవుతోంది. గుంటూరులో పేద రోగులకు జీజీహెచ్ ఆధారం. రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ సమయం దగ్గర పడడంతో జీజీహెచ్ కు వెళ్లింది. రెండు రోజుల క్రితం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. గత రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆ తల్లి పాలు కోసం తన బిడ్డ ఏడుస్తున్నాడేమోనని లేచి చూసి ఒక్క సారిగా దిగ్ర్భాంతి చెందింది.
రెండు రోజుల ఆ పసికందును ఎలుకలు పీక్కు తింటున్నాయి. ఎలుకలు ఆ పసికందు ఒంటినిండా గాయాలు చేసేశాయి. ఆ బాధ తట్టుకోలేక బాబు గుక్కపెట్టి ఏడ్చేశాడు. దీంతో బాబు తల్లి వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడంతో వైద్యులు బాబుకు చికిత్స చేస్తున్నారు.
దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో...ప్రజల ప్రాణాలకు ఎలాంటి రక్షణ ఉందో అర్థమవుతోంది. ఇక్కడ వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటకి మార్పు వస్తుందో ...ప్రభుత్వాసుపత్రి వైద్యం అంటే ప్రజలకు భయం పోయే రోజులు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.