దొంగ ఎలుకలూ.. ఆఖరుకు కరోనా టైంలో మందును కూడా వదలకుండా తాగేస్తున్నాయట.. బియ్యం - గోధుమలు - పప్పు - పండ్లు - కూరగాయాలే కాదు.. ఈ దొంగ ఎలుకల వల్ల మద్యానికి ఎసరు వచ్చి పడింది. అసలే మనుషులకు మద్యం దొరక్క అల్లాడుతుంటే ఈ పాడు ఎలుకలు ఎంచక్కా మద్యంను తాగేస్తుండడం ఆసక్తి రేపుతోంది.
ప్రకాశం జిల్లా అద్దంకి మద్యంషాపులు లాక్ డౌన్ కారణంగా మూతపడ్డాయి. చాలా రోజులుగా మద్యం షాపులు తీయకపోవడంతో ఆ షాపుల్లోని మద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయట.. స్టాక్ లో తేడా వచ్చిందని ప్రశ్నించిన అధికారులకు సదురు మద్యం షాపు యజమాని చెప్పిన సమాధానం ఇదీ..
అద్దంకి సర్కిల్ పరిధిలోని మొత్తం 30 మద్యం షాపుల్లో మొత్తం 13 చోట్ల ఇలా ఎలుకలు మద్యం తాగాయని మద్యం ఓనర్లు సమాధానమిచ్చారట.. ఆరాతీసిన అధికారులకు దిమ్మదిరిగే విషయాలు వెలుగుచూశాయి.
లాక్ డౌన్ వేళ మద్యం బాటిల్స్ ను ఇళ్లకు తరలించి అధిక రేట్లకు విక్రయించారట.. స్టాక్ ఏం చేశారని అడిగితే ఎలుకలు తాగాయని అబద్దం చెప్పారట.. ఇప్పుడు ఈ షాపు ఓనర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి ఎక్సైజ్ పోలీసులు రెడీ అయ్యారు.