రావాలి బాస్..కావాలి కుర్చీ అంటున్నారా?

Update: 2022-11-05 01:30 GMT
ఏపీలో 2024 ఎన్నిక‌ల కాక అప్పుడే మొద‌లైపోయింది. ఈసారి ఎన్నిక‌లు టాలీవుడ్ లోనూ ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌కీయ పార్టీల‌తో సినిమా వాళ్లకు స‌త్ససంబంధాలు ఉండ‌టంతో సీన్ డే బై డే వెడెక్కుతోంది.  వ‌ర్మ `వ్యూహ` తో స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.  వైఎస్సార్ పాద యాత్ర‌-2 కూడా ముస్తాబ‌వుతోంది.

ఏపీ ఎన్నిక‌ల్లో ఓ కొత్త పార్టీ రంగంలోకి దిగ‌డం స‌హా ఆ పార్టీ అధ్య‌క్షుడికి ఇండ‌స్ర్టీ నుంచి భారీగా మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో నిప్పు ఎప్పుడైనా భ‌గ్గుమ‌న‌డానికి ఛాన్స్  క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఫిలిం ఛాంబ‌ర్ టైటిల్ విభాగంలో రిజిస్ట‌ర్ అయిన టైటిల్ సంచ‌ల‌నంగా మారింది. `రావాలా బాస్ ..కావాలి కుర్చీ` అంటూ ఓ టైటిల్ రిజిస్ట‌ర్ అయింద‌ని స‌మాచారం.

కొద్ది రోజుల క్రిత‌మే కొంత మంది మెఓగా వ‌ర్గీయులు ఈ టైటిల్ ని ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు లీకులందుతున్నాయి. మెగా కుటుంబాన్ని ఆరాధించే వారు.. ఫ్యామిలీ ఫాలోవ‌ర్స్ అభిమానంతో ఈ టైటిల్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.  అయితే ఇంత కాలం సైలెంట్ గా ఉన్న అభిమానులు ఇప్పుడే సీన్ లోకి రావ‌డం వెనుక రాజ‌కీయ ఎజెండా?  ఉందా? అన్న సందేహం  తెర‌పైకి వ‌స్తోంది.

అలా కాక‌పోతే ఇప్పుడే ఈ టైటిల్ రిజిస్ట‌ర్ దేనికి చేసిన‌ట్లు?  `రావాలి జ‌గ‌న్..కావాలి జ‌గ‌న్` నినాదం లాంటి టైటిల్ ని రిజిస్ట‌ర్ చేయించ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి? అంటూ ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొచ్చింది. మ‌రి ఇందులో కిరికిరి ఏంటి? అన్న‌ది తెలియాలంటే అస‌లు వ్య‌క్తులు సీన్ లోకి వ‌స్తే త‌ప్ప క్లారిటీ రాదు. ఇక సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ ప‌రంగా జ‌రుగుతోన్న చ‌ర్చ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ‌కీయ‌ వ్యాఖ్య‌ల‌తో సామాజిక మాధ్య‌మాలు వేడెక్కిపోతున్నాయి. తాజా స‌న్నివేశం జ‌నాలకి ఓ ర‌ర‌క‌మైన ఎంట‌ర్ టైన్ మెంట్ లా మారిపోయిది.  ఈ వేడిలో రావాలి బాస్ ..క‌వాలి కుర్చీ మ‌రింత ప్ర‌కంక‌ప‌న‌లు సృష్టించ‌డం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News