ఏపీ చిచ్చు సుప్రీం కోర్టు లాయర్ల మధ్య చిచ్చు పెట్టిందా?

Update: 2020-06-01 04:00 GMT
ఇద్దరు దిగ్గజ లాయర్లు.. ఒకరేమో ప్రభుత్వ వ్యవస్థలో కేంద్రమంత్రిగా ఉంటే..మరొకరు ఏమో సుప్రీం కోర్టులో పేరు మోసిన లాయర్.. ఇద్దరు ఇద్దరే.. కానీ విరుద్ధంగా మాట్లాడారు. వైసీపీ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఒకరు.. టీడీపీ నేతల వాదన తలెత్తుకున్నది ఒకరు.. ఇలా ఇద్దరు సుప్రీం కోర్టు లాయర్ల మధ్య ఏపీ చిచ్చు.. నిజంగా చిచ్చు పెట్టిందా అన్న వాదన వినిపిస్తోంది.

ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ గా ఉండి.. ప్రస్తుతం కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వంలో కేంద్రన్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న రవిశంకర్ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టులను మాధ్యమంగా చేసుకొని తమ రాజకీయాలు నడపాలనుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.  ఏపీలో చంద్రబాబు చేస్తున్నది అదేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వాటికి బలాన్ని ఇచ్చేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.

ఇక ఇంతకుముందే సుప్రీం కోర్టు దిగ్గజ లాయర్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని హరీష్ సాల్వే మండిపడ్డారు. న్యాయస్థానాల గౌరవాన్ని నిలబెట్టేలా వారికి ఇలాంటి రాజకీయ నాయకులకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడి హైకోర్టు తీర్పునిస్తే న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. కులం పేరుతో నిందించడం.. దూషిస్తున్నారని.. బెదిరించడం వంటివి చేస్తున్నారని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జీలను కించపరుస్తూ న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే రీతిలో హరీష్ సాల్వే పాల్గొన్నారు.

ఇలా ఇద్దరు సుప్రీం కోర్టు దిగ్గజ లాయర్లు స్వయానా కేంద్రమంత్రి సైతం ఏపీ లో మొదలైన చిచ్చును ఆధారంగా చేసుకొని పరోక్షంగా విరుద్ధ వాదనలు వినిపించారు. ఒకరు వైసీపీ వాదనతో ఏకభవిస్తే.. మరొకరు టీడీపీకి సపోర్టుగా మాట్లాడారు. ఏపీ చిచ్చు ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్ల మధ్య చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది.
Tags:    

Similar News