ప్రపంచకప్ సెమీస్ లో భారత దారుణ ఓటమి తర్వాత టీమిండియాలోకి రాకుండా ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.. ఎంఎస్ ధోని భవిష్యత్తుపై అభిమానులు, క్రికెట్ నిపుణులు సైతం ఆందోళనగా ఉన్నారు.
తాజాగా ధోని రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచకప్ లో ఓటమి తర్వాత ధోనిని తాను కలువలేదని.. తిరిగి క్రికెట్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ధోనియేనని రవిశాస్త్రి చెప్పాడు. క్రికెట్ నుంచి కనుక ధోని తప్పుకుంటే మహా క్రికెటర్ల జాబితాలో ధోని చేరుతాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ టూరు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ధోని దూరంగా ఉన్నాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదు. తన నిర్ణయమూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే నిర్ణయించుకోవాల్సిందే ధోనియేనని రవిశాస్త్రి చెప్పడం కొసమెరుపు.