వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్వామీ నిత్యానంద లీలలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమయ్యాయి. తీవ్రమైన లైంగిక ఆరోపణలతో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న స్వామి.. ఊహించని రీతిలో తనకంటూ ఒక దేశాన్ని క్రియేట్ చేసుకోవటం.. దానికి కైలాస అని పేరు పెట్టటం సంచలనంగా మారింది.
ఈక్వెడార్ సమీపంలోని ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన తన దేశ పౌరసత్వం పొందాలంటే డబ్బులు చెల్లించాలని వెబ్ సైట్ పెట్టి మరీ ప్రచారం చేయటం తెలిసిందే. ఇటీవల గుజరాత్ లోని ఇద్దరు అమ్మాయిల్ని చట్టవిరుద్ధంగా నిర్బందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతగాడు.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోవటం తెలిసిందే.
అలా మిస్ అయిన స్వామి కోసం వెతుకుతుంటే.. అనూహ్యంగా కైలాస దేశానికి సంబంధించిన వెబ్ సైట్ వెలుగు చూడటం.. తన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు.. సొంత జెండాతో పాటు అధికారుల్ని నియమించుకున్న వైనం పెను సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున సటైర్లు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. తన దేశానికి సంబంధించిన వివరాల్ని Kailaasa.org వెబ్ సైట్లో పొందుపర్చారు.
రాజకీయేతర హిందూ దేశంగా తన దేశాన్ని గుర్తించాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికి విన్నవించుకున్నారు కూడా. ఈ వ్యవహారంపై స్పందించిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాస్తంత ఎటకారం ఆడేశారు. అక్కడకు రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి? వీసా ఆన్ అరైవల్ ఇస్తారా? అంటూ వ్యాఖ్యను పోస్టు చేశారు. దీనిపై నిత్యానందుడు స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిత్యానంద అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. గుజరాత్ పోలీసులు అతడిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మరి.. నిత్యానందను ఆయన దేశానికే వెళ్లి అరెస్టు చేస్తారా? లేక.. మరేదైనా కొత్త పద్దతిని అమలు చేస్తారో చూడాలి.