మ‌నోడ్ని ఉగ్ర‌వాది అన్నారు..కానీ మేయ‌ర్ అయ్యాడు

Update: 2017-11-09 05:19 GMT
దేశం కాని దేశంలో మ‌నోళ్లు త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌టం తెలిసిందే. తాజాగా ఒక సిక్కు వ్య‌క్తి మేయ‌ర్ అయిన ఉదంతం అమెరికాలోని న్యూజెర్సీ లో చోటు చేసుకుంది. మేయ‌ర్ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత‌గాడు విజ‌యం సాధించాడు. ఒక సిక్కు వ్య‌క్తి మేయ‌ర్ కావ‌టం ఇదే తొలిసారి.

న్యూజెర్సీలోని హోబోకెన్ న‌గ‌రానికి మేయ‌ర్ ఎన్నిక జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో ర‌వీంద‌ర్ భ‌ల్లా అనే సిక్కు వ్య‌క్తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ర‌వీంద‌ర్ మీద అక్క‌సుతో కొంద‌రు విష ప్ర‌చారానికి తెర తీశారు. జాతి విద్వేష వ్య‌క్తి అంటూ పోస్ట‌ర్లు అంటించారు.  ర‌వీంద‌ర్ భ‌ల్లాతో మ‌రో ఆరుగురు మేయ‌ర్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డ్డారు.

అయిన‌ప్ప‌టికీ ర‌వీంద‌ర్ విజ‌యం సాధించాడు. మేయ‌ర్ గా ఎన్నికైన తొలి సిక్కు వ్య‌క్తి ర‌వీంద‌ర్ గా చెబుతున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌చారంలో కొంద‌రు ర‌వీంద‌ర్ పై దారుణ‌మైన ప్ర‌చారాన్ని చేశారు. మ‌న న‌గ‌రంలోకి ఉగ్ర‌వాదుల్ని తీసుకురావొద్దంటూ ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారానికి ప‌రాకాష్ఠ ఏమిటంటే.. ర‌వీందర్ ఫోటోతో కూడిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంత తీవ్రంగా సాగిన ఎన్నిక‌ల పోరులో మ‌నోడు మేయ‌ర్ గా ఎన్నిక‌య్యాడు. భారీ ఎత్తున విష ప్ర‌చారం జ‌రిగినా ర‌వీంద‌ర్ ను అక్క‌డి న‌గ‌ర ప్ర‌జ‌లు గెలిపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞతలు చెప్పారు.
Tags:    

Similar News