తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు - మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. కొద్దికాలంగా టీడీపీపై హరీశ్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఘాటు కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు చచ్చిన పాము అని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్ రమణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ - కూతురు కవిత హవా పెరిగిపోయిందన్నారు. ఇంటి పోరుతో పాటు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న హరీశ్ రావు - ఇతర నాయకులూ టీడీపీని విమర్శిస్తూ ఊరట పొందుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ చచ్చిన పాము కాదని - హరీశ్ రావే టీఆర్ ఎస్ లో చచ్చిన పాము వంటి వ్యక్తి అని రావుల ఎద్దేవా చేశారు.
ఇక మిత్రపక్షమైన బీజేపీతో తెలంగాణలో కలిసి సాగడంపై వెలువడుతున్న అనుమానాలకు రావుల క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఇప్పటికైతే కలిసున్నామని పేర్కొంటూ వచ్చే ఎన్నికల పొత్తుల విషయం ఇప్పుడే చెప్పలేమని, అది ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమని రావుల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మే 10 నుంచి 20 వరకు తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని రావుల తెలిపారు. రైతాంగ - కుల వృత్తుల వారి సమస్యలు - విద్య - వైద్య విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాలు - ఇతర అంశాలపై ఐదు కమిటీల్ని నియమిస్తామన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, దీనికి సంబంధించి తీర్మానాలు చేస్తామని రావుల పేర్కొన్నారు. ఈ తీర్మానాలన్నింటినీ విశాఖపట్నంలో జరిగే మహానాడులో ప్రవేశపెట్టనున్నట్లు రావుల వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/