వైసీపీ ప్రభుత్వంపై రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు? తమ ప్రాంతం అభివృద్ధిపై ఏపీ సర్కా రు ఎలా స్పందిస్తోందని భావిస్తున్నారు? సీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ప్రజల ఆలోచన ఎలా ఉం ది? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ నుంచి న వ్యాంధ్ర వరకు రాష్ట్రాన్ని పాలించిన వారు సీమ నాయకులే. ఈ నేపథ్యంలో సీమ ప్రజలు ఎలా ఫీలవు తున్నారనే అంశం.. ఆసక్తిగా మారింది. సీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. వైఎస్సార్ కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు.
ఇక్కడ గడ్డి తినే మేక కూడా సందర్భం వస్తే.. జూలు విదిలిస్తుందని.. అంటారు. అంటే.. అంత పౌరుషం ఇక్కడి నీటికి, నేలకు ఉందని ప్రచారంలో ఉంది. ఇక, రాజకీయంగా కొత్తగా చెప్పేదేముంది. రాజకీయ రెబె ల్స్‌కు రాజకీయ చదరంగానికి ఇక్కడి జిల్లాలు కేరాఫ్‌గా ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్రూపుల వారీ రాజకీయా లు.. సామాజిక వర్గాల వారీ రాజకీయాలు.. సీమలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్.. టీడీపీ ల మధ్య ఒకప్పుడు ఉన్న పోరు.. ఇప్పుడు.. టీడీపీ-వైఎస్సార్ సీపీల మధ్యకు చేరింది. అయితే.. పార్టీల కన్నా కూడా వ్యక్తులు, సామాజిక వర్గాల పరంగా.. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది.
సరే.. ఎలాంటి రాజకీయాలు నడిచినా.. ఇక్కడ నుంచి ఐదుగురు ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్ రాజశేఖరెడ్డి, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఒక్క జగన్ మినహా.. మిగిలిన వారు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించగా.. చంద్రబాబు ఇటు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే.. ఇంత మంది సీమ ప్రాంతం నుంచి పనిచేసినా.. ఏ ఒక్కరూ సీమను అభివృద్ధి చేయలేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
ఇక, ఇక్కడి జిల్లాలను పరిశీలిస్తే.. చిత్తూరులో ఆది నుంచి రెడ్డి వర్సెస్ కమ్మ, కడపలో రెడ్డి వర్సెస్ బలిజ, కర్నూలులో రెడ్డి వర్సెస్ రెడ్డి, అనంతపురంలో రెడ్డి వర్సెస్ బీసీ ఇలా.. ఈ నాలుగు జిల్లాల్లో రెడ్డి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్‌గా మారిపోయింది. అధికారంలో టీడీపీ ఉన్నా.. కాంగ్రెస్ ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఉన్నా.. అంతా రెడ్లదే ప్రభావితంగా ఉంది. కాంగ్రెస్ హయాంలోనూ వైఎస్ రాజశేఖరెడ్డి పాలనా సమయంలోనూ.. రెడ్లు వర్గాలుగా విడిపోయి.. రాజకీయాలు చేసుకున్నారు. టీడీపీలోనూ, కాంగ్రెస్‌లోనూ రెడ్డి వర్గం పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పోటీ చేసేవారు.
ఇక, 2014 ఎన్నికల సమయానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని.. చంద్రబాబును సీఎంను చేశారు. అయితే.. బాబు పాలనలో.. అన్ని పదవులు కమ్మలకే ఇవ్వడం.. కమ్మ సామాజిక వర్గాన్ని మోసేయడం.. కారణంగా.. బాబు పాలనపై రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. బాబు పాలన యాంటి రెడ్ల పాలనగా సాగిందనే ముద్ర పడింది. దీంతో 2019 ఎన్నికలకు ముందు.. ఏకమొత్తంలో రెడ్లందరూ.. దాదాపు 90-95 శాతం వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో నాలుగు సీమ జిల్లాల్లోనూ టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫలితంగా ముగ్గురు మాత్రమే ఈ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. వీరిలో పయ్యావుల కేశవ్, చంద్రబాబు, బాలయ్యలు మాత్రమే విజయం దక్కించుకున్నారు.
ఈ ముగ్గురూ కూడా కమ్మ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక, ఇప్పుడు సీమలో పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది? అనేది చూస్తే.. ఒకప్పుడు ఇక్కడ చక్రం తిప్పిన రెడ్డి నాయకులు.. ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక గోళ్లు గిల్లుకుంటున్నారట. ఎందుకంటే.. ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ పుణ్యమాని.. ఇక్కడ పనులు లేకుండా పోయాయని అంటున్నారు. ఫలితంగా ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇక్కడి రెడ్డి వర్గం చంద్రబాబు వైపు మళ్లుతోంది. అయితే.. ఇక్కడ బాబుపై ప్రేమతో కంటే.. రాజకీయంగా వారికి ఎదురవుతున్న పరాభవాన్ని తగ్గించుకుని.. మళ్లీ పుంజుకునేలా వ్యవహరిస్తున్నారట.
ఈ పరిణామాలతో ఒకప్పుడు.. టీడీపీకి ఇంచార్జ్‌లు లేని నియోజకవర్గాల్లో ఇప్పుడు లెక్కకు మిక్కిలి అన్న లెక్కలో నాయకులు పెరుగుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగానే వర్కువుట్ అవుతున్నట్టు తెలుస్తోంది. డీఎల్ వ్యాఖ్యలతో సీమ ప్రజలు ఏకీభవిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకా ఎంత కాలం భరిస్తాం.. అనే విధంగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఇప్పుడు డీఎల్ వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ముందుగానే ఈ పరిణామాలను గుర్తించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. లేకపోతే.. సీమ నుంచి పార్టీకి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.