'అరవింద సమేత’ వివాదంతో వారి ప్రాణాలు పోయాయా?

Update: 2018-10-17 05:51 GMT
తాజాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకొన్న మూవీ ఎన్టీఆర్ న‌టించిన‌ 'అరవింద సమేత’. ఈ సినిమాలో సీమ‌ను చిన్న‌బుచ్చేలా.. సీమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా సీన్లు ఉన్నాయ‌ని.. వాటిని తీసి వేయాల‌న్న డిమాండ్ ను కొంద‌రు యువ‌కులు తెర మీద‌కు తేవ‌టం తెలిసిందే.

సీమను ఫ్యాక్ష‌న్ ఖిల్లాగా చూపించ‌టం కారణంగా  సీమ ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని.. వారి కారణంగా లేనిపోని ఉద్రిక‌త్త‌లు పెరుగుతున్న‌ట్లుగా కొంద‌రు సీమ కుర్రాళ్లు ఈ మ‌ధ్య‌న హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు.
సీమను చిన్న‌బుచ్చేలా ఉన్న 'అరవింద సమేత’ సినిమాలోని కొన్ని అభ్యంత‌ర‌కర స‌న్నివేశాల్ని తొల‌గించాల‌న్న డిమాండ్ ను తెర మీద‌కు తెచ్చిన అనంపుత‌రం కుర్రాళ్లు తాజాగా హైద‌రాబాద్‌కు వ‌స్తూ ప్ర‌మాదానికి గురైన‌ట్లుగా తెలుస్తోంది.

మీడియా స‌మావేశం త‌ర్వాత ఒక ఛాన‌ల్ లో జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్న వారు.. తాజాగా మ‌రో ఛాన‌ల్ లో చ‌ర్చ కోసం సీమ నుంచి హైద‌రాబాద్‌ కు బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారి ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆప్డేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రాయ‌ల‌సీమ‌కు చెందిన జ‌లం శ్రీ‌ను.. సీమ కృష్ణానాయ‌క్.. ర‌వికుమార్‌.. రాజ‌శేఖ‌ర్ రెడ్డిలు 'అరవింద సమేత’ చిత్రంలోని కొన్ని సీన్ల‌ను తొల‌గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి టీవీ చ‌ర్చ‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు. అయితే.. వారి ప్ర‌యాణం తుంగ‌భ‌ద్రాన‌దిని దాటి కొంత దూరం సాగాక‌.. హ‌ఠాత్తుగా హైవేపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం తీవ్రంగా దెబ్బ తింది. ఈ వాహ‌నంలో ఉన్న జ‌లం శ్రీ‌ను అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లుగా పేర్కొన్నారు.
Tags:    

Similar News