దశాబ్దాల తరబడి కాంగ్రెస్ సీనియర్ నేతగా పేరున్న రాయపాటి సాంబశివరావు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లటం.. సార్వత్రిక ఎన్నికల్లో నరసరావు పేట ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే. ఆసక్తికర వ్యాఖ్యలు అప్పుడప్పడు చేసే రాయపాటి తాజాగా ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారటమే కాదు.. చివరకు ప్రధాన ప్రతిపక్షం సైతం చంద్రబాబు మీద విమర్శలు చేయలేకపోతున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా అధినేతపై ఆయన విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులోని మాచర్ల.. వినుకొండ.. గురజాల గ్రామాల నీటి సమస్యను తీర్చేందుకు వీలుగా రూ.1120కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళితే నిధులు లేవన్నారన్న ఆయన.. కేంద్రంతో గట్టిగా మాట్లాడితే దొబ్బేస్తున్నారంటూ వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు.
కేంద్రంతో గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి అప్పు కోసం ప్రయత్నించానని.. బ్యాంకోళ్లు 9.6శాతం వడ్డీకి అప్పు ఇస్తామంటే.. చంద్రబాబు మాత్రం 8.5శాతం అయితేనే ఓకే అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఆగని రాయపాటి.. గుంటూరు రైల్వే జోన్ కోసం ఒత్తిడి చేద్దామంటే కోప్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ మధ్యన తాను సీపీఐ నేతలకు భోజనాలు పెడితే.. ఎందుకు పెట్టావని చంద్రబాబు ప్రశ్నించారని.. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని.. తనను అడవుల్లోకి (పల్నాడు) తీసుకొచ్చి పడేశారని ఆరోపించారు. అయితే.. ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఆఫ్ ద రికార్డు అంటూనే మైకులో చెప్పేయటం కొసమెరుపు. పాత్రికేయులతో ఎవరైనా రాజకీయ నేతలు.. ప్రముఖులు తన మనసులోని మాటను చెప్పాలని భావిస్తే.. ఆఫ్ ద రికార్డు అంటూ సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి సమాచారాన్ని బయటపెట్టినా.. ఎవరు సమాచారం ఇచ్చారో మాత్రం బయటకు వెల్లడించకుండా గోపత్య పాటించటం పాత్రికేయ ధర్మం. కానీ.. బహిరంగ సభలో ఓపెన్ గా అన్నీ మాట్లాడేసి.. చివర్లో ఆఫ్ ద రికార్డు అని చెప్పి.. రాయొద్దని రాయపాటి కోరటం గమనార్హం. ఆఫ్ ద రికార్డు అనేసి పబ్లిక్ గా మాట్లాడేయటం ఏమిటో ఆయనకే తెలియాలి. అయినా.. ఓపెన్ గా మాట్లాడాక రాయకుండా ఉండటం సాధ్యం కాదు కదా?