డిజిటల్ కరెన్సీకి - క్రిప్టో కరెన్సీలకు సంబంధం లేదు: ఆర్బీఐ

Update: 2021-03-26 07:01 GMT
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) త్వరలో ప్రవేశపెట్టనున్న డిజిటల్ కరెన్సీకి, మార్కెట్ లో ప్రస్తుతం ట్రేడ్ అయ్యే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీకి ఏమాత్రం సంబంధం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఒక మీడియా గ్రూపు ఏర్పాటు చేసిన ఎకనామిక్ సదస్సు గురించి ఆయన మాట్లాడారు.

క్రిప్టో కరెన్సీల విషయంలో ప్రభుత్వంతో తమకు ఎలాంటి అభిప్రాయబేధాల్లేవని.. వాటిపై తమకున్న ఆందోళనల్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు.

ఇక ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వానిదే అన్నారు. ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వం, ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయని.. వీటిని ప్రభుత్వానికి తెలియజేశామని తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా తమ ప్రధాన ఆందోళనలతో ఏకీభవిస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

ఫియట్ కరెన్సీ డిజిటల్ వెర్షన్ పైన ఆర్బీఐ పనిచేస్తోందని.. అలాంటి సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టడం ద్వారా వ్యవస్థలో తలెత్తే ఆర్థిక స్థిరత్వ చిక్కులను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News