సోషల్ మీడియాలో ఉధృతిలో వెల్లువల వస్తున్న ప్రచారం ఒక్కో సారి వాస్తవదూరంగా ఉంటుందనేందుకు ఇదో నిదర్శనం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో తెరమీదకు వచ్చిన పేర్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు రిలయన్స్ సారథి ముకేష్ అంబానీవి. గతంలో రిలయన్స్ లో పనిచేసినందుకు కృతజ్ఞతగా నోట్ల రద్దును ముఖేష్ అంబానీకి ఆర్బీఐ గవర్నర్ ముందే చేరవేశాడనే ప్రచారం సాగింది. అంతేకాకుండా ఉర్జిత్ పటేల్ సతీమణి - అంబానీ భార్య అక్కాచెల్లెళ్లు అని కూడా సోషల్ మీడియా ఊదరగొట్టింది. అయితే ఇందులో నిజం లేదని తాజాగా తేలింది.
తాజాగా సమాచారం ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి ఒకే సోదరి ఉంది. అమె పేరు మమతా దలాల్. తండ్రి రవీంద్రభాయి దలాల్ మరణం అనంతరం మమతా రిలయన్స్ సంస్థలకే చెందిన ఓ పాఠశాలలో పనిచేస్తోంది. కాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సతీమణి పేరు కనన్ పటేల్. ఈమెకు నీతా అంబానీ తండ్రి రవీంద్రభాయి దలాల్ కు ఎలాంటి సంబంధం లేదు. కనన్ పటేల్ తండ్రి పేరు అనిల్ ఆర్ పటేల్ కాగా ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. ఇదిలాఉండా ఉర్జిత్ పటేల్-కనన్ పటేల్‌లకు ఇషికా - ఈషాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇది అసలు విషయం కాగా సోషల్ మీడియా దీన్ని చిలువలు పలువలు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/