ఆర్ బీఐ తాజా ప్రకటనతో లోన్లు తీసుకున్నోళ్లకు లాభమేంది?

Update: 2020-03-27 17:30 GMT
కరోనా వేళ.. ఆర్థిక రంగం ఎంతలా కుదేలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ.. నిత్యవసర వస్తువులు.. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రంగాలు పని చేయటం ఆగిపోయాయి. దీంతో.. బడుగుజీవుల ఆర్థిక పరిస్థితే కాదు.. మధ్యతరగతి వారి పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇలాంటివేళ.. రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించే వాయిదాల మీదా పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఉద్యోగులు సంగతి ఇలా ఉంటే.. వ్యాపార.. ఇతర రంగాలకు చెందిన వారు తమ కార్యకలాపాల్ని నిలిపివేసిన వేళలో.. తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించే విషయంలో ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇలాంటివేళలో.. రిజర్వ్ బ్యాంకు ఇండియా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లే తాజాగా ఆర్ బీఐ రెపో రేట్ ను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్.. లాక్ డౌన్ లాంటి అనివార్య పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందన్న శక్తికాంత దాస్.. తాజాగా రెపో రేటును 75 బేసిక్ పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. రివర్స్ రెపోరేటు 90 బేసిక్ పాయింట్లను తగ్గినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న ఆయన.. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యల్ని చేపట్టనున్నట్లు చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం ఈ పరపతి విధాన నిర్ణయాన్ని ఏప్రిల్ లో ప్రకటించాల్సి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ముందుకు తీసుకొచ్చి ప్రకటించారు. ఎప్పుడూ పాతిక బేసిక్ పాయింట్లు తగ్గించే ఆర్ బీఐ ఏకంగా 75 బేసిక్ పాయింట్లు తగ్గించటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో ఆరుసార్లు తగ్గించిన మొత్తం బేసిక్ పాయింట్లు కలిపితే 210గా మారతాయి. అంతే.. వడ్డీ 2.10 శాతం తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 10 శాతం వడ్డీకి రుణం తీసుకుంటే.. అదిప్పుడు 7.90శాతానికి తగ్గుతుందన్న మాట. అయితే.. మీరు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలకు అనుగుణంగా ఇది అమలు అవుతుందని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. దిగువ.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి జీవులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈఎంఐల విషయంలోనూ కీలక ప్రకటన చేసింది. మూడు నెలల మారిటోరియం విధిస్తున్నట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి.. దాని తీవ్రత ఎంతన్న దానిపైనే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని చెబుతున్నారు. మూడు నెలల ఈఎంఐలపై మారిటోరియంపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. కరోనా వేళ.. బ్యాంకులకు చెల్లించాల్సిన ఈవీఎంఐ భారం అంతో ఇంతో తగ్గుతుందంటున్నారు.


Tags:    

Similar News