నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలలో.. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే మొత్తానికి సంబంధించి పలు పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం.. ఏటీఎంల నుంచి పరిమిత మొత్తంలో డ్రా చేసుకునే వీలున్నా.. ఏటీఎంలు పెద్ద ఎత్తున పని చేయకపోవటంతో డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లి విత్ డ్రా చేసుకోక తప్పని పరిస్థితి. దీంతో.. కొత్త నోట్లు.. చిల్లర నోట్లకు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
ఇక.. బ్యాంకుల్లోని కరెన్సీ నోట్ల కొరత కారణంగా నిబంధనలు ఉన్నప్పటికీ.. విత్ డ్రా మొత్తాన్ని ఆయా బ్రాంచీల్లోని బ్యాంకు అధికారులు విత్ డ్రా మొత్తాన్ని డిసైడ్ చేస్తున్నారు. వాస్తవానికి విత్ డ్రా మొత్తం వారానికి రూ.24వేలు ఉన్నప్పటికీ.. చాలాబ్యాంకుల్లో ఈ విధానాన్ని అమలుచేయటంలేదు. దీనిస్థానే.. రూ.2 వేల నుంచి రూ.10 మధ్యలో తమ వద్ద ఉన్న కరెన్సీని అడ్జెస్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాత నోట్లను కొత్త నోట్లుగా.. చిల్లరనోట్లుగా విత్ డ్రా చేసుకోవటమే తప్పించి.. నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం సాగితే.. బ్యాంకులు తీవ్ర స్థాయిలో నిధుల కొరత ఎదుర్కొనే వీలుంది. ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఆర్ బీఐ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే.. వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నట్లే.. ఆ మొత్తంతో పాటు కొత్త నోట్లను ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. అంత మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు.
మరింత వివరంగా చెప్పాలంటే.. ఒక అకౌంట్లో రూ.50వేలు ఉన్నాయని అనుకుందాం. ఈ ఖాతా నుంచి విత్ డ్రా చేయాలంటే వారానికి రూ.24 వేలు మాత్రమే వీలు ఉంటుంది. ఈ ఖాతాదారుడు తన దగ్గరున్న కొత్త నోట్లు.. వంద తదితర చిల్లర నోట్లను రూ.40వేలు డిపాజిట్ చేస్తే.. అతను.. కొత్త.. చిల్లర నోట్ల రూ.40వేలతో పాటు.. పాత నోట్లకు సంబంధించి రూ.24వేలు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ విధానంతో కొత్త నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తారని ఆర్ బీఐ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/