దేశంలో చెలామణిలో ఉన్న రూ.500 - రూ.1000 కరెన్సీని ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 8న ఒక్క ప్రకటనతో పనికిరాకుండా చేసేశారు. అదే సమయంలో నోట్ల మార్పిడికి డిసెంబర్ 30 తుదిగడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయమే కొత్త ట్విస్ట్ కు కారణమైంది.డిసెంబర్ 30 తరువాత ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల కోసం ఎదురుచూస్తుంటే రిజర్వు బ్యాంకు మాత్రం ఓ వింత పరిస్థితి ఎదుర్కోనుంది. ప్రజలు నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు - పోస్టాఫీసులకు పోటెత్తుతున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి బ్యాంకుల్లో పేరుకుపోనున్న పాత నోట్లను ఆర్బీఐ ఏం చేయబోతున్నదనే ఆసక్తి సర్వత్రా నెలకొంది
బ్యాంకులకు చేరిన పాతనోట్లను ఏం చేస్తారనేది అందరికీ ఆసక్తికరం. ఓ ఆర్బీఐ సీనియర్ అధికారి తెలిపిన వివరాల మేరకు... ముందు వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా ధ్వంసం చేస్తారు. ఈ ముక్కల్లో వాటిలో కొంత బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తారు. కొంత పరిశ్రమల్లో ఉపయోగించుకునే దిమ్మెలుగా వాడుతారు. కొంత భాగాన్ని పేపర్ వెయిట్స్, కప్ బోర్డ్స్ వంటి చిన్నా చితక వస్తువుల తయారీకి వినియోగిస్తారు. అంటే అవన్నీ రూపం మార్చుకుని తిరిగి మన మధ్యకే చేరుతాయన్నమాట.
ఇదిలా ఉండగా డిసెంబర్ 30 నాటికి బ్యాంకులకు దాదాపు 230 కోట్ల పాత నోట్లు చేరుతాయని ఓ అంచనా. ఇవన్నీ ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ శిఖరం కన్నా 300 రెట్లు ఎత్తుగా ఉంటాయట. వీటిని పక్కపక్కన పేర్చుకుంటూ పోటే భూమి నుంచి చంద్రుడి దగ్గరకు ఐదుసార్లు వెళ్లి రావచ్చట. మరి ఇన్ని నోట్లను ఆర్ బీఐ ఏం చేస్తుందా అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు భారత్ లో పెద్దనోట్ల రద్దు గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలోనే పెద్ద చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో 98 శాతం మంది నగదు లావాదేవీలవైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలో దాదాపు రూ.15 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చెలామణిలో ఉన్నదని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందులో 30 శాతం నల్లధనంగా పోగైందని, అదంతా వెనక్కిరాదని భావిస్తున్నది. అంటే దాదాపు రూ.5 లక్షల కోట్లు వెనక్కి రావడం అనుమానమే. మిగతా పాతనోట్లు బ్యాంకులకు చేరనున్నాయి. ఇవి చైనాను మినహాయిస్తే ప్రపంచ దేశాలన్నీ విడుదల చేసే నోట్లకు సమానం!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/