ఏటీఎంల‌లో ఎంతైనా డ్రా చేసుకోవ‌చ్చు

Update: 2017-01-30 13:21 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అత్యంత శుభ‌వార్త ఇదే. ఏటీఎంల‌లో న‌గ‌దు విత్‌ డ్రా పరిమితిని ఫిబ్ర‌వ‌రి ఒక‌టి నుంచి ఎత్తివేయాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. బ్యాంకుల్లోనూ ప‌రిమితిని ఆయా శాఖ‌ల విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేసింది. ఇక క‌రెంట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్‌ - ఓవ‌ర్‌ డ్రాఫ్ట్ అకౌంట్ల వారికి ప‌రిమితిని పూర్తిగా ఎత్తివేసింది. ఎల్లుండి నుంచి ఈ కొత్త నిబంధ‌న‌లు అమల్లోకి రానున్నాయి.

ఇదిలాఉండ‌గా..భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స‌రైన స్థితిలో లేద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిద‌రంబ‌రంతో క‌లిసి ఆయ‌న ఓ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌న్మోహ‌న్ మాట్లాడుతూ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై స‌మ‌గ్ర స‌మాచారంతో తాము డాక్యుమెంట్‌ను త‌యారు చేశామ‌ని, ప‌రిశోధ‌న‌ల ఆధారంగా దాన్నిరూపొందించిన‌ట్లు చిదంబ‌రం తెలిపారు. కొత్త ఉద్యోగాలు ఎక్క‌డ ఉన్నాయని, కొత్త పెట్టుబ‌డులు ఎక్క‌డ ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాలు ఆశావాహంగా ఉండాల‌ని, కానీ నిజ‌మైన ప‌రిస్థితి ఆధారంగా బ‌డ్జెట్ అంచ‌నాలు చేయాల‌న్నారు. తాము త‌యారు చేసిన డాక్యుమెంట్‌, కేంద్ర బ‌డ్జెట్‌ ను పోలి ఉంటుంద‌న్నారు. మ‌రోవైపు  కేంద్ర బ‌డ్జెట్‌ను ముంద‌స్తుగా నిర్వ‌హించ‌డాన్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి త‌ప్పుప‌ట్టారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టిన బ‌డ్జెట్‌ను చేప‌ట్టడం శాస్త్రీయం కాద‌న్నారు. బ‌డ్జెన్‌ ను వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని, 2012 త‌ర‌హాలో వాయిదా వేయాల‌ని సూచించామని, కానీ బ‌డ్జెట్‌ ను ముందుగానే నిర్వ‌హించాల‌ని కేంద్రం భావిస్తోంద‌ని ఏచూరి అన్నారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ముంద‌స్తు బ‌డ్జెట్‌ పై స్పందించారు. బ‌డ్జెట్ స‌మావేశాలు స‌జావుగా సాగాల‌ని విప‌క్షాలు కోరుకుంటున్నాయ‌ని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News