గత డిసెంబర్ మొదట్లో బిట్ కాయిన్ విలువ 20వేల డాలర్లే ఉండేది. కానీ సీక్రెట్ కరెన్సీ అయిన దీన్ని కొనేందుకు ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తెగ ఆసక్తి చూపారు. మార్కెట్లో క్రిప్టో కరెన్సీ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. 3 నెలల్లోనే దీని మార్కెట్ విలువ రెండింతలు అయ్యింది. అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు దాటేసింది.
దీంట్లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ అని.. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గత క్రిస్మస్ రోజున బిట్ కాయిన్ విలువ 24661 డాలర్లు ఉండేది. కొన్ని గంటల్లోనే అది 25000 డాలర్లకు చేరింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరంలో రికార్డు సృష్టిస్తూ 32వేలకు చేరువైంది. ఒక్క వారంలోనే బిట్ కాయిన్ విలువ 3.15శాతం పెరగడం అసాధారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇందులో 50శాతానికి పైగా మార్కెట్ విలువ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ కు ఉంది. బిట్ కాయిన్ మార్కెట్ విలువ దాదాపు 1.1 ట్రిలియన్ డార్లు. బిట్ కాయిన్ తర్వాత ఎథేరియం క్రిప్టో కరెన్సీ రెండో స్థానంలో ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీగా అమెరికన్ డాలర్, యూరప్ ‘పౌండ్’ ఖ్యాతిగాంచాయి. డాలర్ కంటే కూడా పౌండ్ విలువ ఎక్కువ. అయితే అగ్రరాజ్యం అమెరికా కరెన్సీతోనే ప్రపంచదేశాలన్నీ కూడా క్రయవిక్రయాలు, లావాదేవీలు చేస్తుండడంతో డాలర్ కు డిమాండ్ ఉంటుంది. ఒక్క డాలర్ కు మన రూపాయి విలువ దాదాపు 75 రూపాయలకు అటూ ఇటూగా చేరువైంది. కానీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్ లైన్ కరెన్సీ ఇప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.