ఏపీలో వేల‌కోట్లు క‌నిపించ‌ట్లేద‌ట‌

Update: 2017-04-07 05:06 GMT
ఆర్‌బీఐ అధికారుల‌కు అర్థం కాని ప‌జిల్ లా మారింది ఏపీ. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు అస్స‌లు అర్థం కావ‌ట్లేద‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. దేశంలో మ‌రెక్క‌డా లేని ప‌రిస్థితి ఏపీలో నెల‌కొంద‌న్న మాట‌ను ఆర్‌ బీఐ అధికారులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు కొర‌త దేశ వ్యాప్తంగా చోటు చేసుకోవ‌టం.. ద‌శ‌ల వారీగా ఆ కొర‌త‌ను అధిగ‌మించ‌టం తెలిసిందే. ఈ మ‌ధ్య‌న న‌గ‌దు ల‌భ్య‌త‌పై కొంత ప‌రిమితుల్ని అప్ర‌క‌టితంగా అమ‌లు చేయ‌టంతో ఏటీఎం క‌ష్టాలు ఎక్కువ కావ‌టం తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్‌ లో ఏపీ ఉండ‌టం ఆర్‌ బీఐ అధికారుల‌కు ఏమాత్రం అర్థంకావ‌ట్లేదంటున్నారు.

ఎందుకంటే.. దేశంలో మ‌రే రాష్ట్రానికి లేని విధంగా ఏపీకి భారీ మొత్తంలో న‌గ‌దును ఆర్‌ బీఐ పంపింద‌ట‌. కానీ.. ఎంత న‌గ‌దు పంపుతున్నా నోట్ల కొర‌త ఉందంటూ వ‌స్తున్న విన‌తులు వారికి చిరాకు తెప్పిస్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా రూ.2వేల కోట్ల న‌గ‌దుకావాల‌ని ఏపీ అధికారులు అడిగిన‌ప్పుడు రిజ‌ర్వ్ బ్యాంకు అధికారులు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు.

కేంద్రం పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన నాటి నుంచి మార్చి నెలాఖ‌రు వ‌ర‌కూ ఏపీ వ‌ర‌కే రూ.40వేల కోట్ల న‌గ‌దును పంపిన‌ట్లు ఆర్‌ బీఐ అధికారులు చెబుతున్నారు. అంత డ‌బ్బు పంపిన త‌ర్వాత కూడా కొర‌త ఏమిటి? అక్క‌డ డ‌బ్బుల్ని ఏం చేస్తున్నారు? మ‌రే రాష్ట్రానికి ఇంత భారీ మొత్తం పంప‌కున్నా రాని న‌గ‌దుకొర‌త ఏపీకి ఎందుకు వ‌స్తుంద‌న్న ఆశ్చ‌ర్యంలో ఆర్‌ బీఐ అధికారులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ న‌గ‌దు అవ‌స‌రాల కోసం రూ.13వేల కోట్లు పంపాల‌ని ఆర్‌ బీఐపైన ఏపీ ఒత్తిడి తెస్తోంది. ఏపీలో ప్ర‌స్తుతం రూ.2269 కోట్ల న‌గ‌దు మాత్ర‌మే నిల్వ ఉంద‌ని.. ఆ మొత్తాన్ని ఏటీఎంల‌లో పెట్ట‌టానికి ధైర్యం స‌రిపోవ‌టం లేద‌ని తెలుస్తోంది. ఏపీలో న‌గ‌దు కొర‌త‌పై ప్రాధ‌మికంగా వ‌స్తున్న అంచ‌నా ఏమిటంటే.. చేతికి వ‌చ్చిన న‌గ‌దును న‌గ‌దుగానే త‌మ ద‌గ్గ‌రే ఏపీ ప్ర‌జ‌లు ఉంచేసుకుంటున్నారే త‌ప్పించి.. బ్యాంకుల్లో జ‌మ చేయ‌క‌పోవ‌టంతోనే న‌గ‌దుకొర‌త అన్న వాద‌న వినిపిస్తోంది. దేశంలో మ‌రెక్క‌డా లేని ఈ తీరు ఏపీ ప్ర‌జ‌ల్లోనే ఎందుకు ఉన్న‌ట్లు చెప్మా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News