ప్రధాని స్థానంలో ఉన్న వారి ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి. అదేమీ తప్పు కాదు. కానీ.. ప్రధాని కోరుకున్నారని.. ఆయన మనసు పడ్డారన్న ఉద్దేశంతో.. అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకునే విషయంలో ఆర్ బీఐ పాజిటివ్ గా రియాక్ట్ కావటమన్నది చాలా అరుదుగా జరిగేది. ఇంతకాలం మోడీ కోరుకున్నట్లు చేసేందుకు వెనకాముందు ఆడినా రిజర్వ్ బ్యాంక్ సైతం.. తాజాగా మోడీ కోరుకున్నట్లు చేయటానికి వీలుగా ఊహించని రీతిలో రియాక్ట్ అయి.. కేంద్రానికి భారీ బొనంజాను ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రిజర్వ్ బ్యాంక్ వద్ద పరిమితికి మించిన నిధులు భారీగా ఉన్నాయని.. ఆ నిధుల్ని కేంద్రానికి ఇస్తే.. డెవలప్ మెంట్ ను దౌడు తీయిస్తానంటూ మోడీ మాష్టారు ఎప్పటి నుంచో చెబుతున్నదే. అయితే.. మోడీ కోరుకున్నట్లుగా తన దగ్గరున్న రిజర్వ్ నిధుల్ని ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంకు కాలు అడ్డుతున్న తీరుకు భిన్నంగా తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మోడీ కోరుకుంటే.. రిజర్వ్ బ్యాంకు సైతం కాదంటుందా? అన్న భావన కలిగేలా తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల మొత్తాన్ని అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవటం పలువురిని విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆర్ బీఐ దగ్గర స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన రూ.9లక్షల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని.. వాటిలో తమకు రూ.3-4 లక్షల కోట్లు ఇవ్వాలని మోడీ సర్కారు మొదట్నించి అడుగుతున్నదే. ఇందుకు ఆర్ బీఐ ససేమిరా అంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన బోర్డు మీటింగ్ తో కేంద్రానికి ఇవ్వాల్సిన రూ.1.23 లక్షల కోట్ల డివిడెండ్ కు అదనంగా మరో రూ.52,637 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జారీ చేసింది. ఇదే మాత్రం ఊహించలేదన్న మాట ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రామాణికమైన 14 శాతంతో పోలిస్తే ఆర్ బీఐ వద్ద అందుకు భిన్నంగా రెట్టింపు (28శాతం) నిధులు ఉన్న నేపథ్యంలో కేంద్రానికి ఇవ్వాలన్న మోడీ మాష్టారి మాటకు ఆర్ బీఐ తొలుత నో అన్నప్పటికీ తాజాగా మాత్రం ఎస్ అనటం చూస్తే.. మోడీ కోరుకున్నది కాదనే ధైర్యం ఇప్పట్లో ఎవరికి.. ఏ వ్యవస్థకు లేదన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.