ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాల పరంపరలో భాగంగా తాజాగా ఆర్ బీఐ మరో నిర్ణయం తీసుకుంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆర్ బీఐలు.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
నల్లధనానికి.. నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని తీరుకు తగ్గట్లే తాజాగా ఆర్ బీఐ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. నోట్ల రద్దునిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా కొందరు బ్లాక్ మనీ కేటుగాళ్లు.. ప్రధాని మోడీ తెరిపించిన జన్ ధన్ యోజన ఖాతాల్లోకి నల్లధనంతో నింపటం.. వాటితో వైట్ గా మార్చేసుకుంటున్న వైనానికి సంబంధించి చాలానే ఉదంతాలు బయటకు వచ్చాయి.
పేదల అమాయకత్వాన్ని.. వారి అవసరాన్ని తమకు అనువుగా మార్చుకుంటూ.. వారి ఖాతాల్లో నల్లధనం వరద పారిస్తున్న వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో.. జన్ ధన్ యోజన ఖాతాలో డిపాజిట్ అయిన మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు విత్ డ్రా నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఈ ఖాతాల నుంచి నెలకు విత్ డ్రా చేసే మొత్తాన్ని రూ.10వేలకు కుదించింది. అది కూడా కేవైసీ పత్రాలు సమర్పించిన వారికి మాత్రమే. ఒకవేళ కేవైసీ పత్రాల్ని కానీ సమర్పించని ఖాతాల్లో ఉన్న వారు అయితే.. తమ ఖాతాలో ఉన్న మొత్తంలో రూ.5వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించారు. తాజాగా విడుదల చేసిన ఈ ఉత్తర్వులతో నల్లకుబేరులకు భారీ షాక్ తగులుతుందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/