సౌమ్యంగా.. శాంతంగా ఉండే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి కోపం వచ్చింది. అది కూడా తీవ్రస్థాయిలో. పార్లమెంటు సమావేశాల్లో.. విపక్షాలు విరుచుకుపడటం మామూలే. దీనికి అధికారపక్షం నేతలు ఓర్పుగా.. సహనంగా ఉంటారు. అయితే.. తాజాగా పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాలపై జైట్లీ అగ్రహం వ్యక్తం చేశారు.
లలిత్ మోడీ.. వ్యాపం అంశంపై విపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్న సమయంలో మాట్లాడిన శరద్ యాదవ్.. వివాదాలు.. ఆరోపణలు తలెత్తిన సమయంలో మంత్రులు రాజీనామా చేయటమే ఉత్తమం అని వ్యాఖ్యానించారు. దీనికి మద్ధతు అన్నట్లుగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సమయంలో కలుగజేసుకున్న జైట్లీ విసురుగా.. అగ్రహంతో మండిపడ్డారు. నినాదాలు వదిలేసి.. చర్చ జరపాలని తీవ్ర స్వరంతో మండిపడ్డారు. రాజకీయాలు వదిలేయాలని.. దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. అనవసరమైన రాజకీయాలు మానేసి.. సభా కార్యకలపాలకు అడ్డుతగలొద్దంటూ మండి పడ్డారు. కూల్ గా ఉండే జైట్లీ ఇంతలా విరుచుకుపడటానికి కారణం.. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరగకూడదని.. తమ డిమాండ్లకు ఓకే అనే వరకూ పోరాడాలన్న భావనలో విపక్షాలు ఉండటం జైట్లీ చిరాకుకు కారణమంటున్నారు.